అన్వేషించండి

Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా

Software Engineer Bhavana Protest: చిన్న చిన్న కారణాలకే ఉద్యోగుల్ని ఐటీ కంపెనీలు తొలగిస్తున్నాయి. ఓ మహిళా ఉద్యోగిని ఆరోగ్య కారణాలతో సెలవు పెడితే ఆమెను టెర్మినేట్ చేస్తూ మెయిల్ పంపారు.

Employee Termination Case Hyderabad:  మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్ పల్లిలో ఉన్న టెక్ మహీంద్రా ఐటీ కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ఓ ఉద్యోగిని ధర్నాకు దిగారు.   భావన అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, యాజమాన్యం తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిందంటూ కంపెనీ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు. తీవ్రమైన ఒత్తిడి, వేధింపులకు గురిచేస్తూ ఇష్టారీతిన ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ ఆమె చేపట్టిన ఈ నిరసన, ఐటీ వర్గాల్లోనూ, ఐటీ కారిడార్ పరిసరాల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. 

కుమార్తె అనారోగ్యం కారణంగా మూడు రోజుల సెలవు   

బాధితురాలు భావన తెలిపిన వివరాల ప్రకారం, తన కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె ఐటీ కంపెనీ నిబంధనల ప్రకారమే మూడు రోజుల పాటు సెలవు కావాలని యాజమాన్యానికి ముందస్తుగా సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించారు. చిన్నారి ఆరోగ్యం బాగోలేదనే కనీస మానవతా కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోని మేనేజ్‌మెంట్, సెలవు మంజూరు చేయకపోగా ఆమెపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు దిగిందని ఆరోపించారు. ఆ తర్వాత ఏకపక్షంగా ఆమెను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపి షాక్‌కు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.        

కంపెనీలో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లని ఆరోపణలు     

కంపెనీలో ఉద్యోగులపై యాజమాన్యం తీవ్రమైన మానసిక ఒత్తిడిని తెస్తోందని, నిబంధనల పేరుతో కనీస ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తోందని భావన సంచలన ఆరోపణలు చేశారు. పనివేళల్లో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అత్యంత దారుణమైన వాతావరణం అక్కడ నెలకొందని ఆరోపించారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యలు , టుంబ అత్యవసర పరిస్థితులు ఉన్నప్పటికీ బలవంతంగా విధులకు హాజరు కావాలని ఒత్తిడి తెచ్చారని, సిక్ లీవ్‌లకు వేతనం చెల్లించకపోయినా సరే పనికి రావాలని ఈ-మెయిల్స్ ద్వారా వేధించారని ఆమె వాపోయారు. 

పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేసిన ఉద్యోగిని  

కంపెనీ యాజమాన్యం అనుసరిస్తున్న ఈ అన్యాయమైన వైఖరిపై బాధితురాలు భావన ఇప్పటికే స్థానిక దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తనను అకారణంగా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టెక్ మహీంద్రా యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని, తనకు పూర్తి న్యాయం జరిగే వరకు న్యాయపోరాటంతో పాటు నిరసనను కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. మాతృత్వపు హక్కులను, ఉద్యోగుల ఆరోగ్య హక్కులను కాలరాస్తున్న సంస్థ తీరుపై ఐటీ ఉద్యోగ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.        

ఇంకా స్పందించని టెక్ మహింద్రా  

 టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట మహిళా ఉద్యోగి ధర్నా చేపట్టడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ వేధింపుల ఆరోపణలు, ఉద్యోగి తొలగింపు వ్యవహారంపై టెక్ మహీంద్రా కంపెనీ యాజమాన్యం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ఐటీ రంగంలో పెరుగుతున్న జాబ్ సెక్యూరిటీ సమస్యలు, ఒత్తిడి వాతావరణానికి ఈ ఘటన మళ్లీ అద్దం పట్టింది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget