ప్రజా పాలన వారోత్సవాలు, గ్రామసభలు, ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను చేయూత పోర్టల్లో నమోదు చేస్తారు. ధృవీకరణ పత్రాలు సులభంగా పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు.
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Telangana Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారమే లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

- దరఖాస్తుల నమోదుకు ధృవీకరణ పత్రాలు సులభంగా అందించాలని ఆదేశించారు.
Telangana New Pensions | హైదరాబాద్: తెలంగాణలోని పలు బలహీన వర్గాలకు సామాజిక భద్రతను అందించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ (SERP) గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మొదటి విడతలో ప్రాధాన్య క్రమంలో లబ్ధిదారులకు కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తొలి విడత పింఛన్లలో వీరికే ప్రాధాన్యం
తొలి విడత ప్రాధాన్యత జాబితాలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, రక్త సంబంధ వైకల్య సమస్యలైన థలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియాతో బాధపడుతున్న వ్యక్తులను లబ్దిదారులుగా చేర్చారు. గతం 2014-18లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Ms) ప్రకారమే వీటి అర్హత ప్రమాణాలు అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసేవారికి ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించారు.
- వితంతువులు
- ఒంటరి మహిళలు
- దివ్యాంగులు
- కల్లుగీత కార్మికులు
- చేనేత కార్మికులు
- ఫైలేరియా
- తలసేమియా
- సికిల్ సెల్
- హీమోఫీలియా బాధితులు

కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ కోసం ప్రజా పాలన వారోత్సవాలు, ప్రగతి ప్రణాళిక 99 రోజుల గ్రామసభలతో పాటు ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ ఏకరూప దరఖాస్తు నమూనా విధానంలో చేయూత పోర్టల్ (https://www.cheyutha.telangana.gov.in/) నమోదు చేయనున్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వితంతువులకు భర్త మరణ ధృవీకరణ పత్రం, ఒంటరి మహిళలకు విడాకులు/ స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు అబ్కారీ శాఖ, చేనేత కార్మికులకు చేనేత శాఖ, ఫైలేరియా బాధితులకు వైద్యారోగ్య శాఖల నుంచి ధృవీకరణ పత్రాలు వేగవంతంగా జారీ చేసేందుకు సైతం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
చేయూత వెబ్‌సైట్ https://www.cheyutha.telangana.gov.in/ కు వెళ్లాలి.
Cheyutha Application forms అని కనిపిస్తుంది. అందులో తెలుగు, ఇంగ్లీష్ పీడీఎఫ్ అప్లికేషన్ ఫారమ్ ఉంటాయి.
వాటి మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫారం డౌన్ లోడ్ అవుతుంది.
మీ వివరాలు, కేటగిరి నింపి సంబంధిత డాక్యుమెంట్స్ తో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Frequently Asked Questions
కొత్త పింఛన్ల దరఖాస్తులను ఎలా స్వీకరించి, నమోదు చేస్తారు?
ట్రెండింగ్ వార్తలు






















