అన్వేషించండి

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

Banswada MLA Pocharam Srinivas Reddy | పదవుల కోసం కాదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారానని, కానీ కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పోచారం నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ మారగా, సగం నిధులే విడుదలయ్యాయి.
  • నిధుల జాప్యంపై సీఎంను ప్రశ్నించగా, మంత్రుల స్పందన లేదని ఆవేదన.
  • కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగిందని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అన్నారు.

Banswada Politics | బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై, పార్టీ మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పదవుల కోసమో, డబ్బుల కోసమో పార్టీ మారలేదని, కేవలం బాన్సువాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ జెండా కాదు.. జాతీయ జెండా కప్పుకున్నాను
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు అస్సలు ఇష్టం లేకపోయినా, బాన్సువాడ నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తాను కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని, కాంగ్రెస్ జెండాను కాదని వ్యాఖ్యానించారు. బాన్సువాడ       నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను 6 నెలల్లో మంజూరు చేస్తామని తనకు హామీ ఇచ్చారని, కానీ కండువా కప్పుకున్న తర్వాత కేవలం సగం నిధులు మాత్రమే విడుదల చేశారని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు నిలిచిపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే ఆపివేశారని తెలిపారు. 

నవంబరులో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహించిన సందర్భంగా ‘నేను నీకు అమ్ముడుపోయానా? లేక ఎమ్మెల్యేగిరిని కొన్నావా?’ అని రేవంత్ రెడ్డిని సూటిగా అడిగినట్లు పోచారం సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ నిధులు మంజూరు కావడం లేదని ఆయన విమర్శించారు. 

Also Read: KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్

కనీసం ఫోన్ ఎత్తడం లేదు
కనీసం నిధుల విషయమై మాట్లాడదామని ఫోన్ చేస్తే మంత్రులు గానీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గానీ స్పందించడం లేదని, ఫోన్ ఎత్తడం లేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలోనే బాన్సువాడ నియోజకవర్గంలో అసలైన అభివృద్ధి జరిగిందని, తనకు అన్నం పెట్టిన వారిని ఎన్నటికీ మరచిపోలేనని స్పష్టం చేశారు. కొంతమంది దౌర్భాగ్యుల వల్ల కలిగిన పరిస్థితులతోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో బాన్సువాడలో మళ్లీ తమదే విజయమని.. తనకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉందంటూ పోచారం ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని, తమ జెండా ఎగురుతుందని పోచారం అనడంతో కార్యకర్తలు జై పోచారం అంటూ హుషారుగా నినాదాలు చేశారు.

Frequently Asked Questions

పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ ఎందుకు మారారు?

బాన్సువాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని, పదవుల కోసమో, డబ్బుల కోసమో కాదని ఆయన స్పష్టం చేశారు.

నియోజకవర్గ నిధుల గురించి పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమి హామీ ఇచ్చారు?

బాన్సువాడలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను 6 నెలల్లో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, పార్టీ మారిన తర్వాత సగం నిధులు మాత్రమే విడుదలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నిధుల విషయమై పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి ఏమిటి?

ముఖ్యమంత్రితో సహా మంత్రులకు విజ్ఞప్తి చేసినా నిధులు మంజూరు కావడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనివల్ల కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget