ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమవుతాయి. శాసనసభ ఉదయం 9 గంటలకు, శాసన మండలి ఉదయం 10 గంటలకు కొలువుదీరనున్నాయి.
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. నాలుగు రోజుల పాటు సాగే సమావేశాల్లో మెగా డీఎస్సీ, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లపై చర్చించనున్నారు.

- ఏపీ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సోమవారం మొదలయ్యాయి.
- మెగా డీఎస్సీ, ఆరు కీలక బిల్లులు సభకు రానున్నాయి.
- అమరావతి అభివృద్ధి, కొత్త పెట్టుబడులపై ప్రభుత్వం వివరిస్తుంది.
- వైసీపీ సభలను బహిష్కరించగా, స్పీకర్ తీవ్ర హెచ్చరిక చేశారు.
Andhra Pradesh Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ మేరకు ఉదయం 9 గంటలకు శాసనసభ, పది గంటలకు శాసన మండలి కొలువుదీరనున్నాియ. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అత్యంత కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది.
సమావేశాల అజెండా
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతను శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీ సమావేశాల కాలవ్యవధిని, ప్రతి రోజూ చర్చించాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఈసారి సమావేశాల్లో ఒక నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు. భద్రత దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మీడియా, సిబ్బందికి డిజిటల్ పాస్‌లనను తప్పనిసరి చేశారు.
మండలిలో మెగా డీఎస్సీపై వార్
మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ప్రచారం చేస్తోంది. మండలిలో కూడా దీనిపై నిలదీయాలని చూస్తోంది. అందుకే తొలి రోజే మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ సభలో ప్రకటన చేయనున్నారు. పారదర్శకంగా ఎలా నిర్వహించారో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు. దీంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టి భవిష్యత్‌లో చర్చ లేకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
కీలక బిల్లులు ఆమోదం
ఈ సమావేశాల్లో ప్రభుత్వం సుమారు 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని 34శాతానికి పెంచుతూ ప్రభుత్వం బిల్లు తీసుకురానుంది. దీనిపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆగస్టు 18న మంత్రిమండలి ఆమోదించి, అదే రోజు సభలో చర్చకు పెట్టనుంది.
మున్సిపల్ మేయర్లు, చైర్మన్‌ను నేరుగా ప్రజలే ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానానికి సంబంధించి చట్ట సవరణ చేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ఉపసంహరించుకుని, మహిళలు, బాలికల భద్రత కోసం మరింత పటిష్టమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందించనుంది. ఏపీ విద్యుత్ శాసనాలు-2019 బిల్లును ఉపసంహరించుకుంటూ సంబంధిత శాఖ మంత్రులు కొత్త ప్రతిపాదనలు చేయనున్నారు.
అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి
రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తన కార్యాచరణను సభలో వివరించే ఛాన్స్ ఉంది. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్, రైల్వే రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. అలాగే, పెట్టుబడులను ఆకర్షించేందుకు రూపొందించిన ఏపీ పీపీపీ పాలసీ 2026 గురించి కూడా చర్చ జరగనుంది.
అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం- స్పీకర్ హెచ్చరిక
గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా వైసీపీ సభ్యులు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వరని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఖండించారు. సభకు రాకుండా సమయం ఇవ్వడం లేదనడం సరికాదన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి లేదని, కానీ సభకు వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కల్పిస్తాం, సమాధానం చెప్పించే బాధ్యత తనది అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్లపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్‌పై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Frequently Asked Questions
ఏపీ శాసనసభ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
ఎమ్మెల్యేల హాజరును ఎలా నమోదు చేస్తారు?
ఎమ్మెల్యేల హాజరు కోసం డిజిటల్ ఏర్పాట్లు చేశారు. వారు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే హాజరు ఆటోమేటిక్‌గా నమోదు అవుతుంది.
మెగా డీఎస్సీపై ప్రభుత్వం ఏం చేయనుంది?
మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ సభలో ప్రకటన చేస్తారు. దీనిని ఎంత పారదర్శకంగా నిర్వహించారో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు.
ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే కొన్ని కీలక బిల్లులు ఏమిటి?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యాన్ని 34%కి పెంచే బిల్లు, మేయర్/చైర్మన్ ప్రత్యక్ష ఎన్నికల చట్ట సవరణ, దిశ చట్టం ఉపసంహరణ వంటి బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















