అన్వేషించండి

Sonam Wangchuk vs Anna Hazare: వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?

Sonam Wangchuk Hunger Strike: లడఖ్ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు అన్నా హజారే తరహా మద్దతు ఎందుకు లభించడం లేదు? భారతీయ జెన్-జీ కెరీర్ మైండ్‌సెట్ , ఆన్ లైన్ యాక్టివిజం వల్లే స్పందన లేదా?

Anna Hazare vs Sonam Wangchuk Movement:  భారతదేశ పౌర సమాజ ఉద్యమాలలో ఒకప్పుడు అన్నా హజారే  నడిపిన అవినీతి నిరోధక ఉద్యమం దేశ రాజకీయాలనే మార్చేసింది. నాటి ఇండియా అగైన్స్ట్ కరప్షన్ యువతను, మధ్యతరగతిని వీధుల్లోకి తెచ్చింది. కాలం మారింది.. ఇప్పుడు లడఖ్ పర్యావరణ పరిరక్షణ, 6వ షెడ్యూల్ హోదా కోసం ప్రముఖ పర్యావరణవేత్త, రామన్ మెగసేసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ అంతే నిబద్ధతతో ఆమరణ దీక్షలు చేస్తున్నారు. హజారే అవినీతికి వ్యతిరేకంగా పోరాడితే.. వాంగ్ చుక్.. నీట్ అక్రమాల్లో జవాబుదారీ కోసం పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా, సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో అది ఒక సాదాసీదా నిరసనగానే మిగిలిపోతోంది. అన్నా హజారే కాలం నాటి ఉప్పెనను సోనమ్ వాంగ్‌చుక్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? 

వాంగ్ చుక్‌ను జెన్ జీ సీరియస్‌గా తీసుకోలేదా? 

ఈ పరిణామానికి ప్రధాన కారణం.. నేటి యువతరం, ముఖ్యంగా జెన్-జీ  మనస్తత్వాన్ని అంచనా వేయడంలో వాంగ్‌చుక్ కొంతవరకు లడఖ్ భౌగోళిక సరిహద్దులకే పరిమితం కావడం. 3 ఇడియట్స్  సినిమా ఫుంగ్‌సుక్ వాంగ్డూ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన తన గ్లోబల్ ఇమేజ్ కారణంగా, దేశవ్యాప్త యువత లడఖ్ కోసం పెద్ద ఎత్తున తిరుగుబాటుకు సిద్ధమవుతారని బహుశా ఆయన ఊహించి ఉండవచ్చు. కానీ, లడఖ్ సమస్య దేశ సరిహద్దు ప్రయోజనాలకు, పర్యావరణానికి ముడిపడి ఉన్నప్పటికీ.. ఢిల్లీ లేదా ముంబై వీధుల్లో ఉండే సగటు జెన్-జీ యువకుడి దైనందిన జీవితాన్ని అది నేరుగా ప్రభావితం చేయలేకపోతోంది.

ఆన్ లైన్ నిరసనలకే జెన్ జీ పరిమితం

భారతదేశంలో ప్రస్తుత జెన్-జీ తరం గత తరం కంటే అత్యంత ప్రాక్టికల్, కెరీర్ ఓరియంటెడ్‌గా ఉందనేది తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. నేటి యువత ఆర్థిక మాంద్యం భయాలు, తీవ్రమైన ఉద్యోగ పోటీ, ఐటీ రంగాలు,  స్టార్టప్ సంస్కృతి నడుమ ఉపాధి కోసం నిరంతరం పోరాడుతోంది. వారికి సుదీర్ఘమైన రాజకీయ , పర్యావరణ ఉద్యమాల్లో నిరంతరం కూర్చోవడానికి తగినంత  తీరిక  లేదు. జెన్-జీ కేవలం తమ తీరిక సమయాల్లో మాత్రమే ఇలాంటి సామాజిక అంశాలపై డిజిటల్ ప్లాట్‌ఫామ్స్  ద్వారా మద్దతు తెలుపుతోంది తప్ప, అన్నా హజారే కాలం లాగా క్లాసులను బంక్ కొట్టి, రోడ్లపై టెంట్లు వేసి కూర్చునేందుకు ఆసక్తి చూపడం లేదు.

పొరుగు దేశాల్లో వచ్చిన తరహా ఉద్యమాలు రావడం కష్టమే

ఇటీవలి కాలంలో మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక,   బంగ్లాదేశ్‌లలో వచ్చిన తరహా ప్రజా ఉద్యమాలను భారత్‌లోకి వాంగ్‌చుక్ లాంటి వాళ్లు ఎందుకు తీసుకురాలేకపోతున్నారనే దానికి స్పష్టమైన వ్యత్యాసం ఉంది. బంగ్లాదేశ్ లేదా శ్రీలంకలలో జరిగిన ఉద్యమాలు నేరుగా స్థానిక నిరుద్యోగం, రిజర్వేషన్లు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం  వంటి అంశాలపై యువత వ్యవస్థాగత కోపం నుండి పుట్టుకొచ్చాయి. అక్కడ ఉపాధి, భవిష్యత్తు కోల్పోతామనే భయం యువతను హింసాత్మక తిరుగుబాటు వైపు నడిపింది. కానీ భారత్‌లో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటం, లడఖ్ అంశం స్థానిక హక్కులకు సంబంధించినది కావడం వల్ల జాతీయ స్థాయిలో అలాంటి తీవ్రమైన భావోద్వేగ కనెక్టివిటీ ఏర్పడటం లేదు.

సైలెంట్ గా హ్యాండిల్ చేస్తున్న ప్రభుత్వం 

మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే.. రాజకీయ వ్యూహాలలో వచ్చిన మార్పులు. అన్నా హజారే ఉద్యమం నడిచిన కాలంలో టెలివిజన్ మీడియా 24 గంటలూ ఆ నిరసనలను లైవ్ టెలికాస్ట్ చేస్తూ దేశవ్యాప్త సెంటిమెంట్‌గా మార్చింది. కానీ నేటి డిజిటల్ యుగంలో సమాచార ప్రవాహం చాలా ఎక్కువ. ప్రతిరోజూ వందలాది ట్రెండ్స్ మారుతుండటంతో, వాంగ్‌చుక్ దీక్షల వార్తలు సోషల్ మీడియా అల్గారిథమ్స్ మధ్య కొట్టుకుపోతున్నాయి. పైగా, ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిరసనలను   సైలెంట్‌గా  హ్యాండిల్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ ఆశయాలు,  పోరాటం చారిత్రాత్మకమైనది. కానీ, డిజిటల్ ప్రపంచంలో బతుకుతూ, కెరీర్ రేసులో పరిగెడుతున్న నేటి భారతీయ జెన్-జీ యువతను క్షేత్రస్థాయి శ్రమ వైపు నడిపించడంలో పాత తరం ఉద్యమ శైలి సరిపోవడం లేదు. 

టాప్ హెడ్ లైన్స్

KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Local Body Elections Results: స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాలకు కొలమానమా? విజయం కోసం దౌర్జన్యాల వెనుక అసలు కథ!
స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాలకు కొలమానమా? విజయం కోసం దౌర్జన్యాల వెనుక అసలు కథ!
YS Jagan Pulivendula: వైసీపీ హయాంలో ఏకగ్రీవాలు మంచివి .. ఇప్పుడు చెడ్డవా? జగన్ వాదన తేలిపోతోందా?
వైసీపీ హయాంలో ఏకగ్రీవాలు మంచివి .. ఇప్పుడు చెడ్డవా? జగన్ వాదన తేలిపోతోందా?
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Thalassemia in Kids : చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Aadarsha Kutumbam Maala Song : నీ ఒంట్లో ఉంది కరెంటు... వెలిగించవే నా ఫిలమెంటు - వెంకీ నివేదా రొమాంటిక్ సాంగ్ లిరిక్స్
నీ ఒంట్లో ఉంది కరెంటు... వెలిగించవే నా ఫిలమెంటు - వెంకీ నివేదా రొమాంటిక్ సాంగ్ లిరిక్స్
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ vs మారుతి విక్టోరిస్‌ హైబ్రిడ్‌.. మైలేజీ, ఫీచర్లు, ధరలో ఏది ఎక్కువ బెనిఫిట్‌ ఇస్తుంది?
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ vs మారుతి విక్టోరిస్‌ హైబ్రిడ్‌.. ధర, ఫీచర్లు, మైలేజీలో ఏది బెస్ట్‌?
AP Local Body Elections: ఒడిశాలో ఏపీ ఎన్నికలా.. ఆంధ్రా గో బ్యాక్ అన్న బీజేపీ ఏం చెస్తుంది? నవీన్ పట్నాయక్ ఆగ్రహం
ఒడిశాలో ఏపీ ఎన్నికలా.. ఆంధ్రా గో బ్యాక్ అన్న బీజేపీ ఏం చెస్తుంది? నవీన్ పట్నాయక్ ఆగ్రహం
Embed widget