అన్వేషించండి

Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?

CJP protest in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేపై జైపూర్ లో దాడి జరిగింది. నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సమయంలో ఆయన పక్కనే ఉన్న కొందరు చేయి చేసుకున్నారు.

Cockroach Janata Party founder beaten up Rajasthan: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసనలు పెరుగుతున్నాయి.  ఈ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త పర్యటన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం  రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అమరవీరుల స్మారకం  షహీద్ స్మార  వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు, నిరసనకారులు ఆయనపై భౌతిక దాడికి దిగారు. ఈ ఘటన  కలకలం రేపుతోంది.

దేశవ్యాప్త పర్యటనలో భాగంగా జైపూర్‌కు.. 

నీట్ ఎగ్జామ్ అక్రమాలు, నిరుద్యోగం, దేశ విద్యావ్యవస్థలో లోపాలపై విద్యార్థులు, యువత తరఫున పోరాడేందుకు అభిజీత్ దీప్కే దేశవ్యాప్త పర్యటన  చేపట్టారు. పుణేలోని సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం లక్నో, అమృత్‌సర్, బెంగళూరు మీదుగా జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగియాల్సి ఉంది. ఈ క్రమంలోనే జూన్ 15 సోమవారం నాడు జైపూర్‌లో ఒక రోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ ధర్నా ప్రారంభానికి ముందు ఉదయం స్థానిక మీడియాతో మాట్లాడిన అభిజీత్.. దేశంలోని బాధ్యత లేని వ్యవస్థపై యువతలో ఉన్న ఆగ్రహానికి ప్రతీకగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నట్లు ప్రకటించారు.   

ఒక్కసారిగా దాడికి దిగిన గుంపు 

ధర్నా ప్రాంగణంలో అభిజీత్ దీప్కే నిరసనలో ఉండగదా  కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కనే నినాదాలు చేస్తూేన దాడికి దిగారు.  నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేస్తున్న తరుణంలోనే, గుంపులో నుంచి కొందరు ఆయనపై భౌతిక దాడికి   దిగారు. అక్కడ ఉన్న అనుచరులు, భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దాడికి రెండు రోజుల ముందే అభిజీత్‌కు  బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. తమ కుమారుడి ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆయన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో.. మహారాష్ట్రలోని హింగోలి పోలీసులు వారి నివాసానికి తక్షణ రక్షణ ఏర్పాటు చేశారు.

 ఎవరీ అభిజీత్ దీప్కే? ఏంటీ ‘కాక్రోచ్ జనతా పార్టీ’? 

గతంలో ఆమ్  ఆద్మీ పార్టీలో డిజిటల్ కమ్యూనికేషన్స్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేసిన 30 ఏళ్ల అభిజీత్ దీప్కే.. మే 16, 2026న ఒక వ్యంగ్య  రాజకీయ ఉద్యమంగా కాక్రోచ్ జనతా పార్టీ ని స్థాపించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం  లో సోషల్ మీడియా ఆక్టివిస్టులు, నిరుద్యోగ యువతను ఉద్దేశించి  సమాజానికి పట్టిన పరాన్నజీవులు, కాక్రోచ్‌లు  ' అని ఒక వ్యాఖ్య రావడాన్ని ఈ ఉద్యమానికి అవకాశంగా మార్చుకున్నారు. యువత తరఫున ప్రశ్నించేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరుతో ఆన్‌లైన్ ఫారమ్ విడుదల చేశారు. కేవలం ఐదు రోజుల్లోనే ఇన్స్‌టాగ్రామ్‌లో 10 మిలియన్లకు పైగా, ఆ తర్వాత 20 మిలియన్ల ఫాలోవర్స్ సాధించి ఈ గ్రూప్ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను దాటేసి రికార్డు సృష్టించింది.  

 ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టీకరణ 

వ్యంగ్యంగా  ప్రారంభమైనప్పటికీ ఈ సిజేపీ  గ్రూప్.. దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని తీవ్రంగా భుజానికెత్తుకుంది. జైపూర్‌లో తనపై జరిగిన దాడిని అభిజీత్ దీప్కే బృందం తీవ్రంగా ఖండించింది. ఇలాంటి భౌతిక దాడులతో యువత గొంతును నొక్కలేరని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ,  నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేవరకు తమ శాంతియుత పోరాటం ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జూన్ 20 నాటికి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు.


  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget