అన్వేషించండి

Cockroach Janta Party Jantar Mantar: ఆఫ్‌లైన్‌లో తేలిపోయిన కాక్రోచ్ జనతా పార్టీ - జంతర్ మంతర్‌లో అంతంతమాత్రంగానే నిరసన

Abhijeet Dipke Delhi Protest: సోషల్ మీడియా సంచలనం కాక్రోజ్ జనతా పార్టీ ఆఫ్‌లైన్‌లో తేలిపోయింది. జంతర్ మంతర్ నిరసన పెద్దగా వర్కవుట్ కాలేదు.

Dharmendra Pradhan Resignation Demand:  సామాజిక మాధ్యమాల్లో ‘మీమ్స్’, వ్యంగ్య పోస్టులతో భారీ హైప్ సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ప్రభావం చూపలేకపోయింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ, సీబీఎస్‌ఈ (CBSE) మార్కుల లీకేజీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ పార్టీ తొలి ప్రత్యక్ష నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే, ఆన్‌లైన్ ప్రపంచంలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో డిజిటల్ విప్లవంలా కనిపించిన ఈ ఉద్యమం, ఆఫ్‌లైన్  రాజకీయాల్లోకి వచ్చేసరికి చప్పగా సాగింది.

ఆఫ్‌లైన్‌లో పెద్దగా కనిపించని కాక్రోచ్‌ల హంగామా

ఈ డిజిటల్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ఐటీ ప్రొఫెషనల్ అభిజీత్ దీప్కే.. ఈ నిరసన కోసమే ప్రత్యేకంగా అమెరికా నుండి శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో తనను అరెస్ట్ చేస్తారేమోనన్న ఆందోళనల నడుమ, ఆయన నేరుగా ఢిల్లీ పోలీసుల అనుమతితో జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ధర్నాలో కూర్చున్నారు. ఆన్‌లైన్ వేదికలపై ఈ నిరసనకు భారీ ఎత్తున యువత తరలివస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, వాస్తవానికి జంతర్ మంతర్ వద్దకు పట్టుమని కొన్ని వందల మంది మాత్రమే హాజరయ్యారు.   

నిరసనకు హాజరైన సోనమ్  వాంగ్ చుక్ 

ధర్నా జరిగిన ప్రాంతంలో నిరసనకారుల కంటే   రక్షణ వలయంగా నిలిచిన పోలీసులు, జాతీయ మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు , యూట్యూబర్లే ఎక్కువగా కనిపించారు. హాజరైన కొద్దిమంది యువకులు బొమ్మలు, పుస్తకాలు , కాక్రోచ్   మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి లడఖ్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ హాజరై మద్దతు ప్రకటించడం ఈ ధర్నాకు కొంత మైలేజ్ తెచ్చిపెట్టింది. అలాగే కమ్యూనిస్టు పార్టీలు, ఆప్‌కు చెందిన రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా హాజరయ్యారు. 

పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్న అభిజిత్ 

 తాము నెల రోజులుగా సోషల్ మీడియా ద్వారా విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టి అకౌంట్లను హ్యాక్ చేయించడం, పోస్టులను డిలీట్ చేయించడం వంటి పనులకు పాల్పడుతోందని అభిజిత్ దీప్కే ఆరోపించారు.  మీరు మా పోస్టులను డిలీట్ చేయగలరేమో కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న మమ్మల్ని చెరిపేయలేరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాము శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగానే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 

సోషల్ మీడియా హైప్ గ్రౌండ్ లోకి ఎందుకు రాలేదో?

  ఈ నిరసన ప్రదర్శన ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూర్చుని లైకులు కొట్టడం, మీమ్స్ షేర్ చేయడం సులభమే కానీ, నేరుగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం వేరనే సత్యాన్ని ఈ ఘటన నిరూపించింది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై కనిపించే వర్చువల్  హైప్  ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో భారీ జనసందోహంగా మారలేదని, బలమైన క్షేత్రస్థాయి కేడర్ మరియు యంత్రాంగం లేకపోతే ఆన్‌లైన్ ఉద్యమాలు ప్రత్యక్షంగా పెద్దగా సక్సెస్ కాలేవని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget