అన్వేషించండి

CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

ఆన్‌లైన్‌లో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వీధుల్లో గర్జిస్తోంది. నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో లోపాలకు బాధ్యతవహిస్తు  విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సుప్రీంకోర్టు వ్యాఖ్యల నుండి ఉద్భవించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆందోళన.
  • నీట్ లీక్, CBSE అవకతవకలు, ఆత్మహత్యలపై విద్యా మంత్రి రాజీనామా.
  • అభిజీత్ దీప్కే నేతృత్వంలో వేలాదిమంది యువత శాంతియుతంగా నిరసన.
  • జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత, ఇది పార్టీకి తొలి పరీక్ష.

CJP Protest: దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ శనివారం దద్దరిల్లింది. కేవలం కొద్ది వారాల క్రితం సోషల్ మీడియా వేదికగా పుట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ ఇప్పుడు ప్రత్యక్ష పోరాటాలకు దిగింది. శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారి వీధుల్లోకి వచ్చింది.. నీటి పేపర్ లీక్, సీబీఎస్ఈ మార్కింగ్ విధానంలో అవకతవకలు, వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఈ యువత డిమాండ్ చేస్తోంది. 


CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

ఈ ఉద్యమం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటీ?

ఈ ఉద్యమం పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిరుద్యోగ యవతను, నకిలీ డిగ్రీలు ఉన్న వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బొద్దింకలుగా, పరాన్న జీవులుగా అభివర్ణించారు. ఇదే ఈ వేదికకు కారణమైంది. మే 16న అభిజీత్ దీప్కే అనే యువకుడు ఈ విమర్శనే ఒక ఆయుధంగా మార్చుకొని కాక్రోచ్‌ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేశాడు. తనను తాను బొద్దింకలుగా పిలుచుకుంటూ, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించడం మొదలు పెట్టారు. కేవలం కొద్ది రోజుల్లోనే ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 2.2 కోట్లకుపైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఈ గ్రూప్‌ ఇప్పుడు డిటిల్ ప్రపంచం నుంచి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. 


CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

జంతర్ మంతర్‌లో ఏం జరుగుతోంది?

శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన తెలిపేందుకు ఢిల్లీ పోలీసులు సీజేపీకి అనుమతి ఇచ్చారు. అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నేతృత్వంలో వందలాది మంది యువకులు, విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. నిరసనకారులు తమతోపాటు జాతీయ జెండాను, ఒక పుస్తకాన్ని తెచ్చుకున్నారు. ఇది విద్య, దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. 


CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

సాధారణంగా నిరసనలు అంటే ఘర్షణలు, నినాదాలు ఉంటాయి. కానీ సీజేపీ శైలి భిన్నంగా ఉంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా, వారికి ప్రేమ, కృతజ్ఞతతో పూలు అందించాలని దీప్కే తన మద్దతుదారులను కోరారు. దేశ యువత ఇకపై భయపడదు, పోరాడుతుంది, బొద్దింకలు ఎప్పటికీ చావవు, భయపడవు అని యాయన అభిజీత్ ప్రకటించారు. 


CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

ప్రధాన డిమాండ్లు ఇవే!

సీజేపీ ప్రధానంగా విద్యాశాఖలో జరుగుతున్న వ్యవస్థాగత లోపాలపై పోరాడుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న నీటి పరీక్షలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని వారు డిమాండే చేస్తున్నారు. 12వ తరగతి మూల్యాంకనంలో ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్ సిస్టమ్‌ వల్ల జరిగిన పొరపాట్లను వారు ఎత్తి చూపారు. విద్యావ్యవస్థలోని ఒత్తిడి, అక్రమాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. 


CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

ఉద్యమం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్

ఈ ఉద్యమం వెనుక కేవలం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు, విద్యావంతులు కూడా ఉన్నారు. ఇందులో మొదటి వ్యక్తి అభిజీత్‌ దీప్కే. ఈయన బోస్టన్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్‌, గతంలో ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పని చేసిన అనుభవం ఉన్న వ్యూహకర్త.


CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

సౌరవ్ దాస్‌ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, ఆర్టీఐ కార్యకర్త, వ్యవస్థలోని పారదర్శకతపై ఆయన నిరంతరం పోరాడుతున్నారు. అశుతోష్ రాంకా, విజేత దహియా విద్యావిధానాలు, పాలనపై లోతైన అవగాహన ఉన్న వ్యక్తులు. ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్‌ కూడా ఈ నిరసనకు మద్దతు ప్రకటించారు. ఒక వేళ అభిజీత్ దీప్కేను అరెస్టు చేస్తే, తాను ఆరు వారాల పాటు నిరాహార దీక్ష చేస్తానని  హెచ్చరించారు.


CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

ఢిల్లీలో భారీ భద్రత

ఈ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 2వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని, 40 కంపెనీల పారామిలటరీ దళాలను జంతర్ మంతర్ , వీవీఐపీ నివాసాల వద్ద మోహరించారు. ఓలా, ఉబెర్ వంటి ప్రైవేటు క్యాబ్ బుకింగ్స్‌ో ఏమైనా అసాధారణ మార్పులు ఉన్నాయా అని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఆన్‌లైన్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం ఒక ఎత్తు కాక్రోచ్‌ జనతా పార్టీకి ఇది మొదటి పెద్ద పరీక్ష.  


CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

Frequently Asked Questions

కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏమిటి?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతను బొద్దింకలుగా అభివర్ణించిన తర్వాత ఏర్పడిన సామాజిక ఉద్యమం ఇది. అభిజీత్ దీప్కే మే 16న దీనిని ప్రారంభించారు. మొదట సామాజిక మాధ్యమాల ద్వారా మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు ప్రత్యక్ష పోరాటాలకు దిగింది.

కాక్రోచ్ జనతా పార్టీ దేనికోసం నిరసన తెలుపుతోంది?

నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ మార్కింగ్ విధానంలో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఉద్యమం వెనుక ఉన్న ముఖ్య నాయకులు ఎవరు?

అభిజీత్ దీప్కే ఈ ఉద్యమ వ్యవస్థాపకుడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ వంటి ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతున్నారు.

జంతర్ మంతర్ వద్ద నిరసన ఎలా జరిగింది?

ఢిల్లీ పోలీసులు అనుమతితో వందలాది మంది యువకులు జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు. నిరసనకారులు జాతీయ జెండాను, పుస్తకాలను తీసుకువచ్చారు, ఇది విద్య, దేశభక్తికి చిహ్నం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget