భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంబీర్ సహాయక సిబ్బందికి (సపోర్టింగ్ స్టాఫ్) బీసీసీఐ గట్టి షాకిచ్చింది. వారి కాంట్రాక్ట్‌లను రెన్యూవల్ చేసే ప్రసక్తే లేదని, వారిని తొలగించనున్నట్లు బోర్డు తేల్చిచెప్పింది. జట్టు ప్రదర్శనలు, భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.