అన్వేషించండి

Ajit Doval Visits Parliament: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ.. అజిత్ దొవల్ అకస్మాత్తుగా పార్లమెంట్‌కు ఎందుకొచ్చారు ?

Ajit Doval At Parliament నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దొవల్ బుధవారం నాడు పార్లమెంట్‌కు రావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. లోక్‌సభలో పేపర్ లీక్ పై జరుగుతోంది.

Parliament Monsoon Session | న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దొవల్ పార్లమెంట్‌కు చేరుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బుధవారం నాడు లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై కీలక చర్చ జరుగుతోంది. మొదట ప్రతిపక్షాల ఆందోళనతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగా, యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ నడుస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పేపర్ లీక్ బిల్లుపై మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ విషయంలో ఏం జరిగిందో బీజేపీ ఎంపీలు తమ పిల్లలను అడగాలన్నారు. యువత సెంటిమెంట్ ను కేంద్రం గౌరవించాలని, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టవద్దని తన ప్రసంగంలో కేంద్రాన్ని కోరారు.

అజిత్ దోవల్ పార్లమెంట్‌కు చేరుకోగానే సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన మంత్రులకు ఏదైనా కీలకమైన భద్రతా అంశంపై సమాచారం ఇవ్వడానికి వచ్చారా లేక ఏదైనా సున్నితమైన అంశంపై కేంద్రాన్ని అలర్ట్ చేయనున్నారా అని చర్చ మొదలైంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ దొవల్ పార్లమెంట్‌కు రావడం పూర్తిగా రూటీన్ విజిట్ అని తెలుస్తోంది. దోవల్ పార్లమెంట్‌కు రావడానికి ఎలాంటి ప్రత్యేక భద్రతా ఇన్‌పుట్ లేదా అత్యవసర సమావేశంతో సంబంధం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

నేడు లోక్‌సభలో పలు కీలక బిల్లులపై చర్చ

లోక్‌సభ సవరించిన ఎజెండా ప్రకారం నేడు సభలో పలు ముఖ్యమైన బిల్లులపై చర్చించి ఆమోదింపజేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.  వీటిలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు, జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2026తో పాటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లు ఉన్నాయి. 

ఆలస్యంగా నమోదు చేయడానికి కొత్త నిబంధనలు

ప్రతిపాదిత బిల్లు ప్రకారం, ఒకవేళ జననం లేదా మరణం నమోదు ఒకట్రెండుళ్లు ఆలస్యంగా జరిగితే, దానికి జిల్లా మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి అవసరం. మరోవైపు, నమోదు రెండేళ్లకు పైగా ఆలస్యమైతే, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల తర్వాతే నమోదు చేయాలి. ఈ సవరణ ద్వారా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న జనన, మరణాల రికార్డులను ఒకే సెంట్రల్ డిజిటల్ డేటాబేస్‌కు అనుసంధానం చేయనున్నారు. 

Also Read: Ajit Doval Visits Parliament: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ.. అజిత్ దొవల్ అకస్మాత్తుగా పార్లమెంట్‌కు ఎందుకొచ్చారు ?

ఆధార్, ఓటర్ ఐడీ  పాస్‌పోర్ట్‌తో లింక్

ఇందులో సెంట్రల్ డేటాబేస్‌ను ఆధార్, ఓటర్ల జాబితా, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి ప్రధాన ప్రభుత్వ పత్రాలతో కూడా అనుసంధానం చేస్తారు. దాంతో రికార్డుల పరిశీలన సులభతరం అవుతుంది. ప్రభుత్వ సేవలలో పారదర్శకత పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై కూడా చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వం ఈ బిల్లును సభ ఆమోదంపజేయాలని ప్రయత్నిస్తుంది.

సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచే బిల్లు 

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతారు. న్యాయవ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించడం, కేసులను వేగంగా పరిష్కరించడం లక్ష్యంగా ఈ బిల్లును కేంద్రం తీసుకోస్తుంది. కేంద్ర మంత్రి అమిత్ షా జనన మరణాల నమోదు సవరణ బిల్లును ప్రవేశపెడతారు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget