అన్వేషించండి

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి

India Vs Sri Lanka: శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ ఉంచిన ఇండియా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు పడగొట్టి విజయం దిశగా దూసుకెళ్తోంది.

IND VS SL 1st Test, Indian Bowlers Push For Victory:  గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో టీమ్ ఇండియా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్ర‌త్య‌ర్థి ముందు భారీ టార్గెట్ నిర్దేశించగా, మంగళవారం నాలుగోరోజు ఆటముగిసేసరికి 34 ఓవర్లలో లంక 4 వికెట్లకు 84 పరుగుల మాత్రమే చేసింది. విజయానికి ఇంకా 288 పరుగులు కావాలి. మానవ్ సుతార్ రెండు వికెట్లతో రాణించాడు.  బుధ‌వారం మ‌రో ఆరు వికెట్లు తీసే టీమిండియా గెలుపు సొంత‌మ‌వుతుంది. అంత‌కుముందు త‌మ‌ రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వికెట్ కీపర్ బ్యాట‌ర్ రిష‌భ్ పంత్ (66) టాప్ స్కోర‌ర్. బౌల‌ర్ల‌లో అసిత ఫెర్నాండో కు నాలుగు, జ‌య‌సూర్య‌కు మూడు, లహిరు కుమార‌కు రెండు వికెట్లు ద‌క్కాయి. శ్రీలంక ముందు 372 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. గాలే అంతర్జాతీయ స్టేడియం చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ 2022 లో పాకిస్తాన్ సాధించిన 344 పరుగులు మాత్రమే. అలాంటి గాలే పిచ్ పై 372 రన్స్ ఛేజ్ చేయడం లంకకు దాదాపు అసాధ్యమైన టాస్క్ గా మారింది.

పంత్ మెరుపు హాఫ్ సెంచరీ.. పడిక్కల్ సూపర్ బ్యాటింగ్
అంత‌కుముందు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త్  త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్లను కోల్పోయింది. య‌శ‌స్వి జైస్వాల్ డ‌కౌట్ కాగా, శుభ‌మాన్ గిల్ (8), ర‌వీంద్ర జ‌డేజా (9) విఫ‌ల‌మ‌య్యారు. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ తో పాటు తొలి ఇన్నింగ్స్ సెంచ‌రీ హీరో దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (44) ఆక‌ట్టుకున్నారు. శ్రీలంక బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే  పంత్ కేవలం కొన్ని ఓవర్లలోనే 66 రన్స్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టీ బ్రేక్ సమయానికి ఇండియా 193 పరుగులు జోడించి పర్యాటక జట్టుకు భారీ టార్గెట్ ను నిర్దేశించింది.

మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్.. లంక నాలుగు వికెట్లు డౌన్
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. పేసర్ మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా వికెట్ తీశాడు. ఆ తర్వాత స్పిన్నర్ మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో రెండు కీలక వికెట్లు పడగొట్టి లంక టాప్ ఆర్డర్ ను కూల్చేశాడు. రవీంద్ర జడేజా మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లంక బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ ధ‌నంజ‌య డిసిల్వా (31 బ్యాటింగ్) టాప్ స్కోర‌ర్ కాగా, అత‌నితోపాటు సోనాల్ దినుష (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 

వెలుతురు లేమితో ఆట నిలిపివేత.. చివరి రోజు విజయంపై భారత్ కన్ను
సాయంత్రం 6 త‌ర్వాత‌ మైదానంలో వెలుతురు మందగించడంతో అంపైర్లు లైట్ మీటర్ ద్వారా పరీక్షించి నాలుగో రోజు ఆటను ముగించారు. ఆఖరి రోజు కూడా వర్ష సూచన ఉన్నప్పటికీ, మిగిలిన ఆరు వికెట్లను త్వరగా పడగొట్టి తొలి టెస్టును సొంతం చేసుకోవాలని శుభ్‌మన్ గిల్ సేన పూర్తి పట్టుదలతో ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget