Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
India VS Sri Lanka 1st Test: గాలే టెస్ట్ మూడో రోజు అంపైర్ అహ్సన్ రజా వైపు సిరాజ్ విసిరిన త్రో మిస్ కాగా జడేజా నవ్వులు పూయించాడు.

IND VS SL, Ravindra Jadeja Laughs At Siraj Throw: శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్ వేగంగా విసిరిన త్రో నేరుగా లెగ్ అంపైర్ అహ్సన్ రజా వైపు దూసుకొచ్చింది. రాడ్ టక్కర్ స్థానంలో సబ్‌స్టిట్యూట్ అంపైర్‌గా వచ్చిన రజా, అప్రమత్తమై చివరి క్షణంలో పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చూసి రవీంద్ర జడేజా ఫన్నీగా నవ్వుతూ ఎంజాయ్ చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
Mohammed Siraj's wild throw from the deep almost hits on-field umpire on Day 3 of SL vs IND 2026 1st Test pic.twitter.com/ocxa97aycj
— Cricket Hub (@Anurag9793) August 17, 2026
కామేంటేటర్ల మాటల యుద్ధం..
మరోవైపు మూడో రోజు లంచ్ బ్రేక్ సమయంలో లైవ్ టెలివిజన్ లో అనూహ్య సీన్ కనిపించింది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ మధ్య ఆన్-ఎయిర్ లో వాడివేడి మాటల యుద్ధం నడిచింది. స్టూడియోలో ఉన్న కార్తీక్, గాలే గ్రౌండ్ లో ఉన్న మంజ్రేకర్ ముఖ కవళికలు, పౌట్ పై జోకులు వేయడంతో ఈ గొడవ మొదలైంది. వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
పౌట్ పై కార్తీక్ కామెంట్స్.. మాటలు అర్థం కావట్లేదని ఎద్దేవా
లంచ్ సమయంలో లైవ్ లో మాట్లాడుతూ మురళీ కార్తీక్ మొదట రెచ్చగొట్టేలా మాట్లాడాడు. "ఇక్కడున్న అందరి తరఫున ఒక చిన్న రిక్వెస్ట్. నీది శతాబ్దపు బెస్ట్ పౌట్. కానీ నువ్వు అలా పెదవులు ముడుచుకుని మాట్లాడటం వల్ల నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకు అస్సలు అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి ఆ పౌట్ ను కాస్త తగ్గించుకో" అని కార్తీక్ ఎద్దేవా చేశాడు. దాంతో గాలే గ్రౌండ్ లో ఉన్న మంజ్రేకర్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యాడు.
CRICKET LAFDA LOADING…
— Sunil Gavaskar (@virender_swag) August 17, 2026
Sanjay Manjrekar and Murli Karthik Heated Convo Escalated So Quickly!
Karthik- because of your pout we are not understanding what you are saying so Limit your Pout Sanjay.
Rahane- i was not part of it.
Sanjay- Do you ever Look into Mirror, its not very…
రహానే ఫేస్ బాగుంది.. కెమెరా అటు తిప్పమన్న మంజ్రేకర్
కార్తీక్ మాటలకు గట్టి కౌంటర్ ఇస్తూ మంజ్రేకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ కు కామెంట్రీ చెబుతున్న అజింక్య రహానే వైపు కెమెరా తిప్పాలని డైరెక్టర్ ను కోరాడు. "ఇది చాలా చెత్త కామెంట్. స్క్రీన్ ను స్ప్లిట్ చేసి కెమెరాను రహానే వైపు తిప్పండి. ఎందుకంటే అతడు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అతడి ముఖం కూడా ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. కార్తీక్ అద్దంలో చూసుకుంటూ తన వాయిస్ ను తానే పొగుడుకుంటాడు" అని మంజ్రేకర్ అన్నాడు. దీనికి కార్తీక్ బదులిస్తూ, "నేను అద్దంలో చూసుకోను, అది చేసేది నువ్వు మాత్రమే" అని బదులిచ్చాడు.
సోషల్ మీడియాకు పండగే.. గొడవను ఆపేసిన మంజ్రేకర్
పరిస్థితి మరింత సీరియస్ గా మారకముందే మంజ్రేకర్ జోక్యం చేసుకుని టాపిక్ ను ముగించే ప్రయత్నం చేశాడు. "అద్దంలో చూసుకోవడానికి ఒక ఆకర్షణ ఉండాలి. నీ విషయంలో అది పెద్దగా మోటివేటింగ్ గా ఉండదని నేను అర్థం చేసుకోగలను. ఎలాగూ మనం ఇద్దరం లైన్ దాటుతున్నాం, ఇది చూసి సోషల్ మీడియాలో పండగ చేసుకుంటారు" అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ముగిసినా, లైవ్ లో సీనియర్ ప్లేయర్లు ఇలా తిట్టుకోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేసింది.
Before You Go
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
ట్రెండింగ్ వార్తలు



















