అన్వేషించండి

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

లంకతో జరుగుతున్న గాలే టెస్ట్ లో కుల్దీప్ బౌలింగ్ లో కమిందు మెండిస్ ఇచ్చిన క్యాచ్ ను గాల్లోకి డైవ్ చేస్తూ గిల్ అద్భుతంగా అందుకున్నాడు. అంత‌కుముందు ధ‌నంజ‌య కూడా ఇలాంటి క్యాచ్ నే స్లిప్ లో అందుకున్నాడు.

Shubman Gill Flying Catch Marvel, IND VS SL Galle Test Updates:  శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలుత శ్రీలంక కెప్టెన్ ధ‌నంజ‌య డిసిల్వా, ఆ త‌ర్వాత భార‌త సార‌థి శుభ‌మాన్ గిల్ అద్భుత‌మైన క్యాచ్ లతో అలరించారు. ముఖ్యంగా మూడో రోజు ఆటలో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎక్స్‌ట్రా కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్, గాల్లోకి ఎగురుతూ ఎడమవైపునకు డైవ్ చేసి పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసిన కామెంటేటర్లు, ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

గాల్లోకి లేచిన గిల్.. కమిందు మెండిస్ ఔట్
ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఫుల్లర్ లెంగ్త్ బంతిని లంక బ్యాటర్ కమిందు మెండిస్ ముందుకు వచ్చి డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి గాల్లోకి లేవడంతో చాలా మంది ఫీల్డర్లు బంతిని కేవలం ఆపడానికే ట్రై చేసే పరిస్థితి ఉంది. కానీ గిల్ మాత్రం అద్భుతమైన రిఫ్లెక్స్ ప్రదర్శిస్తూ గాల్లోకి డైవ్ చేసి బంతి నేలను తాకే లోపే ఒంటిచేత్తో గట్టిగా ఒడిసిపట్టాడు. క్యాచ్ పట్టిన తర్వాత బంతిని పైకి విసిరేసి గిల్ సంబరాలు చేసుకున్నాడు.

సంజయ్ మంజ్రేకర్ కాంప్లిమెంట్స్.. అసాధ్యమైన క్యాచ్ గా వర్ణన
ఈ క్యాచ్ పై లైవ్ కామెంట్రీలో ఉన్న భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించాడు. "వావ్, ఆ క్యాచ్ ను అలా పట్టడం నిజంగా అసాధ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆ బంతి అతడి రీచ్ లో అస్సలు లేదు. బ్యాటర్ కూడా బంతి గాల్లో ఉన్నా ఫీల్డర్ కు చాలా దూరంగా ఉందని అనుకుని ఉంటాడు. ఎక్స్‌ట్రా కవర్ ఏరియాలో మీరు చూసే బెస్ట్ క్యాచ్ లలో ఇది కచ్చితంగా ఒకటి" అని కొనియాడాడు.

ధనంజయ సూపర్ క్యాచ్.. జురెల్ వికెట్ హైలైట్
ఇంతకుముందు రెండో రోజు ఆటలో శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా కూడా ఇదే తరహా అద్భుతమైన క్యాచ్ తో మెరిశాడు. ప్రభాత్ జయసూర్య వేసిన ఇన్నింగ్స్, 110వ ఓవ‌ర్లోని ఒక‌ బంతిని డిఫెన్స్ చేయబోయిన భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఎడ్జ్ తీసుకోగా, ఫస్ట్ స్లిప్ లో ఉన్న లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా ఒక చేత్తో సూపర్ క్యాచ్ అందుకున్నాడు. రెండో రోజు ఆటలో 51 పరుగులు చేసిన జురెల్ ఆ క్యాచ్ తో వెనుదిరిగాడు. పడిక్కల్ 167 రన్స్, రాహుల్ 82 రన్స్ చేయడంతో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 462 ప‌రుగులకు ఆలౌటైంది. మ‌రోవైపు లంక 284 ప‌రుగుల‌కు ఆలౌట‌వ‌గా, ఇండియాకు 178 ప‌రుగుల భారీ ఆధిక్యం ద‌క్కింది.   

టాప్ హెడ్ లైన్స్

Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Yashasvi Jaiswal Trade: రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
Usman Khawaja Scandal:  ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
Rahul- Jaiswal Partnership:  కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్ - రాహుల్.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు
కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్-రాహుల్ జంట.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget