అన్వేషించండి

Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!

కొత్త బంతి తీసుకున్న వెంటనే అటాకింగ్ షాట్ ఆడి అవుటైన రిషభ్ పంత్ కు కామన్ సెన్స్ లేదని మహమ్మద్ కైఫ్ తీవ్ర విమర్శలు చేశాడు.

IND VS SL 1st Test, Mohammad Kaif Criticizes Rishabh Pant Dismissal: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అవుటైన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రీజులో కుదురుకున్న తర్వాత 62 బంతుల్లో 39 రన్స్ చేసి మంచి స్కోరు దిశగా సాగుతున్న సమయంలో అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. శ్రీలంక 81వ ఓవర్లో రెండో కొత్త బంతిని తీసుకున్న వెంటనే పంత్ క్రీజు వదిలి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడబోయాడు. అయితే బంతి బ్యాట్ కింది భాగానికి తగిలి మిడ్ ఆఫ్ లో క్యాచ్ గా వెళ్లింది. పంత్ ఆడిన ఈ షాట్ సెలెక్షన్‌ను భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ తీవ్రంగా తప్పుబట్టాడు.

కామన్ సెన్స్ వాడాలి.. కొత్త బంతిని చూడకుండానే అటాక్
తాజాగా ఒక‌ ఛానెల్ లో మాట్లాడిన మహమ్మద్ కైఫ్, పంత్ బ్యాటింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. "పంత్ అవుటైన విధానంపై నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు, అతడు ఎప్పుడూ అలాగే ఆడతాడు. కానీ కామన్ సెన్స్ ఉండాలి కదా అన్నదే నా అభ్యంతరం. లంక టీమ్ కొత్త బంతి తీసుకున్న మొదటి ఓవర్ అది. ఆ ఓవర్లోనే అతడు మూడుసార్లు క్రీజు వదిలి ముందుకు దూకాడు. కామన్ సెన్స్ ఉంటే కట్ షాట్ ఆడేవాడు. టెస్ట్ మ్యాచ్ సంప్రదాయం ప్రకారం కొత్త బంతి ప్రభావం తగ్గే వరకు కనీసం ఐదారు ఓవర్లు వేచి చూడాలి. ఎంత దూకుడుగా ఆడే ప్లేయర్ అయినా కనీస ఆలోచన ఉపయోగిస్తాడు" అని పేర్కొన్నాడు.

150 రన్స్ చేసినా బంతులు వదిలేస్తారు.. 
మిగతా బ్యాటర్లలో ఉండే క్రికెటింగ్ లాజిక్ పంత్ లో కనిపించలేదని కైఫ్ చెప్పాడు. "ఓవర్ తొలి బంతికే అతడు ముందుకు దూకడం నన్ను ఆశ్చర్యపరిచింది. కొద్దిగానైనా మ్యాచ్ పరిస్థితిని లెక్కించాలి. ఒక బ్యాటర్ 150 రన్స్ మీద ఉన్నా కూడా కొత్త బంతి వచ్చినప్పుడు కొన్ని బంతులను జాగ్రత్తగా ఆడతాడు. అందుకే పంత్ కు నేను కొన్ని మార్కులు కట్ చేస్తున్నాను. క్రికెటింగ్ సెన్స్, లాజిక్ విషయంలో అతడు చాలా వెనుకబడిపోయాడు" అని విశ్లేషించాడు. పంత్‌ను లంక అరంగేట్ర బౌలర్ కేశర నువాంత పెవిలియన్ పంపాడు.

పీక‌ల్లోతు క‌ష్టాల్లో లంక‌.. 5 వికెట్లు డౌన్
ఇక తొలి టెస్టులో శ్రీలంక పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. భార‌త్ సాధించిన తొలి ఇన్నింగ్స్ స్కోరు 462ను మ్యాచ్ చేసేందుకు తంటాలు ప‌డుతుంది. క‌డ‌ప‌టి వార్త‌లందేస‌రికి 26.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 90 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఓపెన‌ర్ లాహిరు ఉదారా (27) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. మాన‌వ్ సుతార్ కు రెండు, మ‌హ్మ‌ద్ సిరాజ్, కుల్దీప్ యాద‌వ్, రవీంద్ర జడేజా కు త‌లో వికెట్ ద‌క్కింది. ప్ర‌స్తుతం భార‌త్ కంటే 372 ప‌రుగుల వెనుకంజ‌లో నిలిచింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND Playing XI Vs NZ: కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
కివీస్ తో రేపే నాలుగో వన్డే.. టీమిండియాలో మార్పులు.. ఆస‌క్తిక‌రంగా ప్లేయింగ్ లెవ‌న్!
IND VS PAK Final: కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
కెప్టెన్ రాయ్‌చందానీ, ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపులు.. అఫ్గాన్ చిత్తు.. టీమిండియా బంప‌ర్ విక్టరీ, ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Axar Patel Captaincy: కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget