అన్వేషించండి

Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..

భారత స్పిన్ త్రయం మాయాజాలంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ కు 178 పరుగుల భారీ లీడ్ దక్కింది. మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో రెచ్చి పోయాడు.

Galle Test Updates, Indian Spinners Demolish Lanka:  శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ సోమ‌వారం మూడో రోజు ఆటలో టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్న‌ర్లు మాయాజాలం ప్ర‌ద‌ర్శిచ‌డంతో లంకను 79.4 ఓవర్లలో 284 పరుగులకే ఆలౌట్ చేశారు. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ సోనాల్ దినుష స్ట‌న్నింగ్ సెంచ‌రీ (168 బంతుల్లో 100, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో మాన‌వ్ సుతార్ కు నాలుగు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అంత‌కుముందు మూడో రోజు ఆట ప్రారంభమైన నాలుగు బంతుల్లోనే ఇండియా తొలి ఇన్నింగ్స్ 462 పరుగుల వద్ద ముగిసింది. అయితే ఆ ఆనందం ఆతిథ్య శ్రీలంక జట్టుకు ఎంతోసేపు నిలవలేదు. భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు. పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరంభంలోనే వికెట్ తీయగా, ఆ తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగి మ్యాచ్ ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.

మానవ్ సుతార్ ఫస్ట్ బాల్ మ్యాజిక్.. కుప్పకూలిన లంక టాప్ ఆర్డర్ 
యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన తొలి బంతికే లంక సీనియర్ బ్యాటర్ దినేష్ చండిమాల్ ను అవుట్ చేసి మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంక మిడిలార్డర్ కాసేపు ప్రతిఘటించినా భారత స్పిన్ త్రయం రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ వరుసగా ఒత్తిడి పెంచారు. దాంతో లంక స్కోరు 27/1 నుంచి 59/4 కి పడిపోయింది. లంచ్ సమయానికి జడేజా మరో కీలక వికెట్ తీసి లంకను కోలుకోలేని దెబ్బ తీశాడు.

284 పరుగులకే శ్రీలంక ఆలౌట్.. భారీగా పెరిగిన వర్షం
ఆ తర్వాత సెషన్లలో శ్రీలంక బ్యాటర్లు కాస్త పోరాడినప్పటికీ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో లంకను చాలా త్వ‌ర‌గానే ఆలౌట్ చేశారు. ఆఖరి వికెట్ స్టంపింగ్ తో ముగియడంతో ఇండియాకు తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మిగ‌తా బౌల‌ర్లలో వెట‌ర‌న్ ర‌వీంద్ర జ‌డేజాకు మూడు, మ‌హ్మ‌ద్ సిరాజ్, ప్ర‌సిధ్ కృష్ణ‌, కుల్దీప్ యాద‌వ్ కు త‌లో వికెట్ ద‌క్కింది.  ఆ వెంటనే మైదానంలో భారీ వర్షం మొదలవడంతో అంపైర్లు మూడో రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఆకాశం పూర్తిగా నల్లటి మేఘాలతో కమ్ముకోవడంతో గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో పిచ్ ను కప్పివేశారు.

నాల్గో రోజు ఉదయమే ఆట షురూ.. ఉదయం 9:45 గంటలకు ఫస్ట్ బాల్
వర్షం కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు నాల్గో రోజు ఆటను కాస్త ముందుగానే ప్రారంభించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9:45 గంటలకు తొలి బంతి పడనుంది. భారీ ఆధిక్యంతో ఉన్న టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు జోడించి శ్రీలంక ముందు భారీ టార్గెట్ ఉంచేందుకు వ్యూహాలు రచిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget