అన్వేషించండి

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం

ఢిల్లీ జల్ బోర్డు ఎస్‌టీపీ (STP) టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసులో అవినితీ నిరోధక శాఖ ఆప్ సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఢిల్లీ జల్ బోర్డు టెండర్ల కుంభకోణంలో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టు.
  • అక్రమ టెండర్లు, నిబంధనల ఉల్లంఘనలపై ఏసీబీ ఆరుగురిని అరెస్టు చేసింది.
  • సత్యేంద్ర జైలులో ఉండగా అరెస్టుపై బీజేపీపై ఆప్ విమర్శలు.
  • ఒక కంపెనీకి లాభం చేకూర్చేందుకు నిబంధనలు మార్చారని ఆరోపణ.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు ఎస్‌టీపీ (STP) టెండర్ల కుంభకోణం ఆరోపణలపై మాజీంత్రితో సహా 6 మందిని మంగళవారం (ఆగస్టు 18) నాడు అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు చేసింది. ఢిల్లీ జల్ బోర్డు మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాష్ రాయ్, ఢిల్లీ జల్ బోర్డు మాజీ కాంట్రాక్చువల్ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాత్సవ, M/s AN ఎంటర్‌ప్రైజెస్ ప్రొప్రైటర్ నాగేంద్ర యాదవ్, యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని రాజా కుమార్ కుర్రా, సృజన్హార్ ప్రొప్రైటర్ పంకజ్ వర్మలను ఏసీబీ అరెస్టు చేసింది. మే 11, 2024న అవినీతి నిరోధక చట్టం, IPC సెక్షన్ల కింద జల్ బోర్డు టెండర్ల కుంభకోణంపై ఈ కేసు నమోదైంది.

బీజేపీపై ఆప్ నేత విమర్శలు

బీజేపీకి AAP అంటే ఎంత భయమో చెప్పడానికి ఇంకా ఎన్ని ఆధారాలు కావాలని ఆప్ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ అనురాగ్ ధండా ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినట్లుగా చెబుతున్న జల్ బోర్డు టెండర్ సమయంలో సత్యేంద్ర జైలులో ఉన్నారు. జైలులో ఉన్న వ్యక్తి దీనికి ఎలా బాధ్యత వహిస్తారు? సత్యేంద్ర జైన్ పంజాబ్ సహ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. త్వరలో పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు.


అసలు కేసు, ఆరోపణలు ఏంటీ..

విజిలెన్స్ డైరెక్టరేట్ నుంచి ఈ ఫిర్యాదు వచ్చింది. ఢిల్లీ జల్ బోర్డు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) అప్‌గ్రేడేషన్ టెండర్‌లో భారీగా అక్రమాలు, టెండర్ నిబంధనల ఉల్లంఘన, నేరపూరిత కుట్ర జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెండర్‌లో ఉద్దేశపూర్వకంగా కొన్ని సాంకేతిక నిబంధనలను పొందుపరిచారని, దీనివల్ల M/s యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే  కంపెనీకి మాత్రమే లబ్ధి చేకూరేలా చేశారని ప్రాథమిక విచారణలో తేలింది. మరో సంస్థ పోటీ పడకుండా ఆప్ వారికి టెండర్లు అప్పగించిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రతిపాదిత పైలట్ ప్రాజెక్టు అనుకున్నట్లుగా నిర్వహించలేదు. చాలా నిబంధనల్ని ఆప్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. అలాగే శుద్ధి చేసిన నీటికి సంబంధించి ఉండాల్సిన ముఖ్యమైన పరిమితులను తొలగించినట్లు అభియోగాలు ఉన్నాయి.

ఆర్థిక లావాదేవీలు

ఆర్థిక విచారణలో కమిషన్, లంచం డబ్బును సృజన్హార్,  ఏఎన్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా మళ్లించినట్లు వెల్లడైంది. యూరోటెక్‌కు చెందిన కంపెనీల నుంచి నాగేంద్ర యాదవ్ సంస్థకు భారీగా నిధులు వచ్చాయి. మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాష్ రాయ్, ఆయన బంధువుల బ్యాంక్ ఖాతాల్లోకి ఏఎన్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా రూ. 1.52 కోట్ల లంచం పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బుతోనే ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.

సత్యేంద్ర జైన్ అరెస్టుపై కేజ్రీవాల్ మండిపాటు

మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టుతో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ BJPపై మండిపడ్డారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ, సత్యేంద్ర జైన్‌ను మరోసారి బీజేపీ అరెస్టు చేయించిందని ఆరోపించారు. కొంతకాలం కిందట ఆయనను జైలులో పెట్టి ఎంత దారుణంగా ట్రీట్ చేశారో రాష్ట్ర ప్రజలు అందరికీ గుర్తుంది. గత కేసు కూడా ఫేక్ కేసు కాగా, ఈ ఆరోపణలు సైతం నిజం కావని త్వరలోనే తేలుతుందన్నారు.

బీజేపీది నియంతృత్వ పాలన- కేజ్రీవాల్

‘బీజేపీ ఇంకా ఎంతకాలం ఇలా నియంతృత్వాన్ని కొనసాగిస్తుంది?. వాళ్లకు ఇష్టం వచ్చిన వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేసి జైలులో పెడుతున్నారు. వారు చెప్పేది అబద్ధం, ఆరోపణలన్నీ అవాస్తవాలే అని దేశ ప్రజల ముందు బయటపడుతుంది. కానీ జైలు జీవితం సమయంలో అనుభవించిన మానసిక వేధింపులకు పరిహారం ఎవరు చెల్లిస్తారు? బీజేపీ పాలన మొత్తం పాపాలతో నిండిపోయింది.  బీజేపీఎంత నియంతృత్వం చేసినా, త్వరలోనే మోదీ ప్రభుత్వం అంతం అవుతుంది. ఆప్‌తో పాటు దేశ ప్రజలు సత్యేంద్ర జైన్‌కు అండగా నిలుస్తారని’ కేజ్రీవాల్ అన్నారు.

Frequently Asked Questions

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఎందుకు అరెస్ట్ అయ్యారు?

ఢిల్లీ జల్ బోర్డు ఎస్‌టీపీ (STP) టెండర్ల కుంభకోణం ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ACB) ఆయనను అరెస్టు చేసింది. ఆయనతో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు.

సత్యేంద్ర జైన్ అరెస్టుకు దారితీసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

ఢిల్లీ జల్ బోర్డు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) అప్‌గ్రేడేషన్ టెండర్‌లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన ప్రధాన ఆరోపణలు. టెండర్ నిబంధనలు ఒక కంపెనీకి మాత్రమే లబ్ధి చేకూర్చేలా రూపొందించబడ్డాయి.

సత్యేంద్ర జైన్‌తో పాటు అరెస్ట్ అయిన ఇతర వ్యక్తులు ఎవరు?

ఢిల్లీ జల్ బోర్డు మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాష్ రాయ్, మాజీ కాంట్రాక్చువల్ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాత్సవ, M/s AN ఎంటర్‌ప్రైజెస్, యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, సృజన్హార్ యజమానులను అరెస్టు చేశారు.

సత్యేంద్ర జైన్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందన ఏమిటి?

బీజేపీకి ఆప్ అంటే భయమని, ఈ అరెస్టు రాజకీయ ప్రేరేపితమని ఆప్ ఆరోపించింది. ఆరోపణలు వచ్చిన సమయంలో జైన్ జైలులో ఉన్నారని ప్రశ్నించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget