అన్వేషించండి

Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్

TPCC Chief Mahesh Kumar Goud | కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు గాంధీ భవన్‌కు చేరాయని, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వనపర్తి ఎమ్మెల్యే వర్గీయులు చిన్నారెడ్డిపై గాంధీభవన్‌లో తీవ్ర నిరసన తెలిపారు.
  • టికెట్ల అమ్మకం ఆరోపణలపై చిన్నారెడ్డిపై మేఘా రెడ్డి ఫిర్యాదు చేశారు.
  • లక్షల ఓట్లు తొలగించడంపై మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల సంఘాన్ని విమర్శించారు.
  • పేదల ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని గౌడ్ అన్నారు.

Telangana Politics | హైదరాబాద్: నల్గొండ, వనపర్తి కాంగ్రెస్ పంచాయితీ ముదిరి హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జి. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి అనుచరులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. "చిన్నారెడ్డి హటావో, కాంగ్రెస్ బచావో" అంటూ గాంధీ భవన్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలిపారు. గతంలో ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్నారంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి చిన్నారెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి ఆరోపణలు పార్టీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన ఈ ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, పరిశీలించిన తర్వాత తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మేఘా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిలకు సంబంధించిన అంశాలన్నింటినీ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమగ్రంగా పరిశీలిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో లక్షల ఓట్లు తొలగించారు: మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SSR) ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా లక్షలాది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్రస్థాయిలో ఆరోపించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన సర్‌ ముసాయిదా జాబితాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (BLO) సరిగ్గా ఇళ్లను సందర్శించకుండానే పేదలు, వలస కూలీల ఓట్లను అత్యధికంగా డిలీట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా తమ అధీనంలోని సంస్థగా మార్చుకుందని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. 2002 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదికగా మార్పులు చేయడంపై స్పందిస్తూ, ఆ వివరాలు ప్రస్తుతం ఎంతమందికి అందుబాటులో ఉన్నాయని ప్రశ్నించారు. నియోజకవర్గాల డీలిమిటేషన్, పోలింగ్ కేంద్రాల మార్పుల వల్ల పాత వివరాలు సక్రమంగా లేవని, 2002 జాబితాతో ముడిపెట్టకుండా పౌరులకు నేరుగా ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. అకారణంగా 73 లక్షల ఓట్లను తొలగించి, మొత్తం 92 లక్షల ఓట్లను ప్రశ్నార్థకం చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
 

Frequently Asked Questions

తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుత వివాదం ఏమిటి?

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జి. చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి అనుచరుల మధ్య వివాదం ఉంది. గతంలో ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్నారన్న చిన్నారెడ్డి వ్యాఖ్యలపై మేఘా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

చిన్నారెడ్డిపై ఫిర్యాదుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందన ఏమిటి?

పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలిస్తుందని తెలిపారు.

తెలంగాణలో ఓటర్ల జాబితా తొలగింపుపై మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు ఏమిటి?

ఎన్నికల సంఘం లక్షలాది ఓట్లను తొలగించిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బూత్ స్థాయి అధికారులు సరిగ్గా ఇళ్లను సందర్శించకుండానే పేదల, వలస కూలీల ఓట్లను తొలగించారని ఆయన ధ్వజమెత్తారు.

ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని తమ అధీనంలోని సంస్థగా మార్చుకుందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. 2002 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదికగా మార్పులు చేయడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget