కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్‌వే విధానాన్ని ప్రారంభించారు. వాహనదారులు నిర్ణీత రూట్‌లలో మాత్రమే ప్రయాణించాలి.
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
KBR Park Traffic Rules:హైదరాబాద్‌లో అత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో నేటి నుంచి 360 డిగ్రీల వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. సుమారు రెండేళ్లపాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

- కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం ట్రాఫిక్ తగ్గిస్తుంది.
- హెచ్-సిటీ ప్రాజెక్ట్ పనులకై సుమారు రెండేళ్ళు అమలు.
- పర్యవేక్షణకు భారీగా ట్రాఫిక్ సిబ్బంది, సాంకేతికత వినియోగం.
- రద్దీ తగ్గించి వాహనదారులకు శాశ్వత పరిష్కారం లక్ష్యం.
KBR Park Traffic Rules:హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనదారులకు కీలక సూచన చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పూర్తి స్థాయిలో వన్‌వే విధానాన్ని ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా పరిష్కరించేందుకు చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు
కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 1300 కోట్ల భారీ వ్యయంతో ఫైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తోంది. ఈ పనులు సాఫీగా సాగడంతోపాటు భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులను దాదాపు 80 నుంచి వంద శాతం వరకు తగ్గించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ భారీ నిర్మా పనుల దృష్ట్యా, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండేందుకు వన్‌వే విధానాన్ని ప్రవేశ పెట్టారు.
360 డిగ్రీల వన్‌వే విధానం అమలు
ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఆగస్టు 18, 2026 మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఆంక్షలు నిర్మాణ పనులు పూర్తి అయ్యే వరకు సుమారు రెండేళ్ల పాటు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాలు పార్క్ చుట్టూ నిర్ణీత రూట్‌లలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. వాహనదారుల సౌకర్యార్థం ఈ మార్గంలో 13 లైన్ ఛేంజర్లు, పది ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే గూగుల్ మ్యాప్స్, ఇతర నావిగేషన్ యాప్‌లో ఈ మార్పులకు అనుగుణంగా రూట్లను అప్‌డేట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) August 18, 2026
🚦 KBR PARK ONE-WAY TRAFFIC SYSTEM IS NOW LIVE! 🚦
The One-Way Traffic System around KBR Park is now operational.
📍 Google Maps have been updated with the new routes for the convenience of commuters.
🪧 Proper signage boards and necessary traffic equipment have… pic.twitter.com/AYxDVuiBkj
నిరంతరం ట్రాఫిక్ రద్దీని గమనిస్తూ చర్యలు
ఈ కొత్త విధానాన్ని పర్యవేక్షించేందుకు భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వివిధ షిఫ్టుల్లో 450 నుంచి వెయ్యి మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ జోన్‌లకు చెందిన ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ కదలికలను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాల ద్వారా నిరంతరం ట్రాఫిక్ రద్దీని గమనిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
బస్టాప్‌లు రీలొకేషన్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హైదరాబాద్ నగరవాసులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. అక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయని వాటిని వెంటనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రాంగ్ రూట్‌లో ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాప్‌ల మార్పు విషయంలో ఇప్పటికే ఆర్టీసీ ఎండీతో పోలీసులు చర్చలు జరిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాప్‌లను రీలొకేట్ చేశారు. కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాకర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. రాత్రివేళల్లో ట్రాఫిక్ తక్కువగా ఉందని అతివేగంగా వెళ్లొద్దని, సైన్ బోర్డులు గమనిస్తూ ప్రయాణించాలని సూచించారు.
ఈ వన్‌వే విధానాన్ని నేరుగా అమలు చేయకుండా రెండు సార్లు ట్రయల్స్ నిర్వహించారు. అప్పుడు ఎదురైన ఇబ్బందులు గమనించి అవి రిపీట్ కాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ హెచ్-సిటీ పూర్తి అయితే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నెంబర్ 45, ఫిలింనగర్ వంటి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Frequently Asked Questions
కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఏమిటి?
కేబీఆర్ పార్క్ వద్ద వన్‌వే విధానం ఎందుకు అమలు చేస్తున్నారు?
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం జరుగుతోంది.
కేబీఆర్ పార్క్ వద్ద వన్‌వే విధానం ఎంతకాలం అమలులో ఉంటుంది?
ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనలు నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు సుమారు రెండేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఇది మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి మొదలైంది.
వాహనదారుల సౌకర్యార్థం ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
13 లైన్ ఛేంజర్లు, పది ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. గూగుల్ మ్యాప్స్‌లో రూట్లను అప్‌డేట్ చేశారు. బస్టాప్‌లను కూడా రీలొకేట్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు





















