అన్వేషించండి

Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?

Narcissistic Abuse : ప్రేమ అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం, నమ్మకం, స్వేచ్ఛ, పర్సనల్ స్పేస్ ఇవ్వడం. మీ రిలేషన్లో ఇలాంటివి లేకుండా ఎలాంటి రెడ్​ ఫ్లాగ్స్​ఉంటే అస్సలు లైట్ తీసుకోకూడదంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నాసిసిస్టిక్ అబ్యూస్ అంటే మానసికంగా వేధించడం, స్వీయ సందేహం కలిగించడం.
  • రిలేషన్​లో నిందించడం, గ్యాస్‌లైటింగ్‌తో ఒంటరి చేయడం ప్రధాన లక్షణాలు.
  • ఇలాంటి వేధింపులు ఆత్మవిశ్వాసం తగ్గిస్తాయి; వెంటనే నిపుణులను సంప్రదించాలి.

Narcissistic Abuse and Red Flags in Love : రిలేషన్‌షిప్‌లో ప్రేమ, కేరింగ్ ఉండటం సహజం. హెల్తీ రిలేషన్​లో ఇవి చాలా కామన్​గా ఉంటాయి. కానీ అదే ప్రేమ పేరుతో ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడం, అతని లేదా ఆమె నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రతి విషయంలో తప్పులు ఎంచి.. జరుగుతున్న విషయాల వల్ల తమ మీద తమకే అనుమానం వచ్చేలా చేయడం, తప్పులకు తామే కారణం అని కృంగిపోయేలా చేయడం మాత్రం హెల్తీ రిలేషన్​ కాదు. ఈ తరహా ప్రవర్తననే Narcissistic Abuse అంటారు. 

ఈ మధ్యకాలంలో Narcissistic Abuse అనేది సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత రిలేషన్ గురించి.. మానసికంగా పడిన వేదన గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటంతో ఈ అంశం మరోసారి చర్చనీయాశమైంది. చాలామంది సోషల్ మీడియా వేదికగా తమకి జరిగిన అంశాలను షేర్ చేసుకుంటూ తాము కూడా Narcissistic Abuseతో ఇబ్బంది పడ్డాము అని చెప్తున్నారు. 

Also Read : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే

Narcissistic Abuse అంటే..

ఒక రిలేషన్​లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి పదేపదే మిమ్మల్ని మానిప్యులేట్ చేస్తూ.. అవమానిస్తూ.. మీ సొంత విషయాల్లో కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ.. భావోద్వేగ వేధింపులకు పాల్పడటమే Narcissistic Abuse. అయితే ఇది అవతలి వ్యక్తి దృష్టిలో ప్రేమగానే ఉండొచ్చు. కానీ అనుభవించే వాళ్లపై మాత్రం దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వేధింపులు శారీరకం హింస రూపంలో ఉండకపోవచ్చు. కేవలం మానసికంగానే మిమ్మల్ని కృంగదీస్తాయి. 

ఉదహారణకు మిమ్మల్ని మాటలతో అవమానించవచ్చు.. మీ ఫీలింగ్స్, ఎమోషన్స్​ని చిన్నచూపు చూడటం లేదా పట్టించుకోకపోవడం, మిమ్మల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి దూరం చేయడం, మీ నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అనేలా చేయడం వంటివి ఈ వేధింపుల్లో భాగమవుతాయి. అయితే మీరు కూడా ఇలాంటి రిలేషన్​లో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి కొన్ని విషయాలపై ఫోకస్ చేయాలి. మీ పార్టనర్​కు, మీకు మధ్య ఈ రెడ్​ ఫ్లాగ్స్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 

Also Read : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే

ప్రతి విషయానికీ నిందించడం

మీ బంధంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుటి వ్యక్తి తన తప్పును అంగీకరించకుండా మిమ్మల్నే బాధ్యులుగా చూపిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. నీ వల్లే ఇలా జరిగింది.. నువ్వు అలా చేయడం వల్లే నాకు కోపం వచ్చింది అంటూ పదేపదే నిందిస్తుంటే జాగ్రత్త. 

మీపై మీకే అనుమానం రప్పించడం..

Narcissistic abuseలో ఎక్కువగా Gaslighting ఉంటుంది. అంటే మీకు బాగా గుర్తున్న సందర్భాన్ని కూడా లేదు అలా అసలు జరగలేదు, నువ్వే అనుకుంటున్నావు.. నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పి.. మీకే మీ మీద డౌట్ వచ్చేలా చేయడం చేస్తారు. దీంతో మీరు నిజంగా తప్పు నాదేనా? నేనే అపార్థం చేసుకున్నానా? అని కృంగిపోయేలా చేయడమే దీని ఉద్దేశం. 

Also Read : టాక్సిక్ అత్తమామలతో ఇబ్బందిపడుతున్నారా? మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఈ రిలేషన్‌షిప్ టిప్స్ ఫాలో అవ్వండి

మొదట్లో ఉన్న ప్రేమ.. తర్వాత ఉండకపోవడం

ప్రేమించిన కొత్తలో మీపై ప్రేమ వర్షాన్ని కురిపించి.. కాంప్లిమెంట్స్ ఇచ్చి.. కేర్ తీసుకుంటారు. గిఫ్ట్స్, ప్రేమ, కేర్​ చూపిస్తూ మిమ్మల్ని ఎమోషనల్​గా వారితో కనెక్ట్ అయ్యేలా చేస్తారు. మీరు బాగా కనెక్ట్ అయిన తర్వాత అదే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైపోతారు. మిమ్మల్ని పట్టించుకోకపోవడం లేదా విమర్శించడం చేస్తారు. అయితే ఇది అన్ని సందర్భాల్లో వేధింపులుగా అనుకోకూడదు. కొన్నిసార్లు మీ పార్టనర్ నిజంగా బిజీగా ఉండడం జరగవచ్చు. కానీ వారు మిమ్మల్ని మ్యానిప్యూలేట్ చేస్తున్నారా.. కంట్రోల్ చేస్తున్నారా అనే విషయాలు కూడా పరిగణలోకి తీసుకుని తర్వాత నిర్థారించుకోవాలి.

ఒంటరి చేయడం.. 

మీతోనే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీని దూరం చేస్తారు. నీ ఫ్రెండ్స్ నిన్ను అర్థం చేసుకోరు.. నీ పేరెంట్స్ నీకు ఫ్రీడమ్ ఇవ్వరు.. వీళ్ల వల్ల మనకి టైమ్ ఉండట్లేదు. మన రిలేషన్​ పాడుఅవుతుంది అంటూ.. మీరు దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని ఒంటరిగా.. అన్ని విషయాలకు మీ పార్టనర్​పై డిపెండ్ అయ్యేలా చేయడమే లక్ష్యంగా ఉంటుంది. 

Also Read : ప్రేమించిన వాడి నుంచి అమ్మాయిలు ఏమి కోరుకుంటారో తెలుసా? ఇలా ఉంటే వారికి చాలా నచ్చుతారట

నిందలు, అవమానాలు

మీకు సంబంధించిన ప్రతి విషయాల్లోనూ లోపాలు వెతుకుతారు. మీ లుక్స్, తెలివి, పని, స్నేహితులు, కుటుంబం.. ఇలా ప్రతి విషయంలోనూ లోపాలు వెతికి.. మీ సక్సెస్​ని కూడా తక్కువగా చేసి మాట్లాడతారు. లేదా ఇతరులతో మిమ్మల్ని పోల్చి మానసికంగా మీరు తక్కువ అనే ఫీల్ రప్పిస్తారు. 

ఇవే కాకుండా మీతో మాట్లాడకుండా సైలెంట్ ట్రీట్​మెంట్ ఇవ్వడం, మీ పర్సనల్ స్పేస్​ని లెక్కచేయకపోవడం, ఇలా మాట్లాడకు నాకు ఇష్టం లేదని మీరు క్లియర్​గా చెప్పినా.. వాటిని పట్టించుకోకపోవడం కచ్చితంగా రెడ్​ ఫ్లాగ్స్​గా గుర్తించాలి. వాటిపై వర్క్ చేయడం లేదా మీ రిలేషన్​ గురించి మళ్లీ ఓ సారి ఆలోచించుకోవడం చేయాలి. లేదా మీరు ఓ రిలేషన్​లో ఉన్నప్పుడు మీలో కొన్ని మార్పులు గమనించినా జాగ్రత్తగా ఉండాలి. అవేటంటే.. 

Also Read : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే

తేడాలు గుర్తించండి..

ప్రేమించకముందు ఆత్మవిశ్వాసంతో ఉండే మీలో సెల్ఫ్​ కాన్ఫిడెన్స్ తగ్గడం, ఏమి చేసినా తప్పు చేస్తున్నానా అనే డౌట్ రావడం, యాంగ్జైటీ, మానసికంగా కృంగిపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది, ఇతరులను నమ్మలేకపోవడం, ఒంటరిగా ఎవరితో కలవలేకపోవడం వంటివి ఉండొచ్చు. అయితే ఇది మీ వల్ల మీకు జరుగుతున్నాయో.. ఇతరుల వల్ల లేదా ఇతర కారణాల వల్ల మీకు జరుగుతున్నాయో గుర్తించాలి. క్లారిటీ వచ్చినా.. రాకున్నా.. మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

ఇలాంటి రిలేషన్​లో మీరుంటే ఏమి చేయాలి?

ముందుగా మీ రిలేషన్​ని అర్థం చేసుకోండి. ఏదైనా ఒకసారి తెలియక జరుగుతున్నాయా? లేదా పదేపదే ఈ అంశాలు జరుగుతున్నాయో గుర్తించాలి. ఏమైనా తేడా కనిపిస్తే మీకు బాగా నమ్మకం ఉన్న వ్యక్తితో ఈ విషయాన్ని చెప్పండి. అవసరమైతే సైకాలజిస్ట్​ని సంప్రదించి.. వారి సహాయం తీసుకోవచ్చు. 

Also Read : మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే.. అబ్బాయి, అమ్మాయి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget