అన్వేషించండి

Dating Trend : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే

Love Beyond Looks : చూడటానికి అందంగా లేకపోయినా.. మనసు మాత్రం ఎంతో బంగారం అంటూ సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్​ని తీసుకొచ్చారు Gen Zలు. మరి ఆ ట్రెండ్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • Gen Z లు ఇప్పుడు బాహ్య సౌందర్యం కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
  • ఇన్‌స్టాగ్రామ్‌లో 'Shrekking' ట్రెండ్ ద్వారా లక్షల మంది తమ మద్దతు తెలుపుతున్నారు.
  • Shrek పాత్ర స్ఫూర్తితో, హృదయం గొప్పదనాన్ని ఈ ట్రెండ్ హైలైట్ చేస్తుంది.
  • ఈ ట్రెండ్ భావోద్వేగ అనుబంధానికి, నమ్మకానికి విలువనిస్తుంది.

Shrekking Dating Trend : అందానికి వెనక ఉన్న నొప్పిని తెలుసుకున్న Gen Zలు.. ఇప్పుడు కొత్త దారిని వెతుకుతున్నారు. తాము ప్రేమించిన అబ్బాయి లేదా అమ్మాయి లుక్స్ గురించి కాకుండా మనసు, వారి గొప్పతనం గురించి ఓపెన్​గా మాట్లాడుతున్నారు. అలా లుక్స్ బట్టి కాకుండా ప్రేమించడాన్ని ష్రెక్కింగ్ అంటున్నారు. నా బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ చూడడానికి అందంగా లేకున్నా.. నా జీవితంలో చూసిన మంచి వ్యక్తి వీళ్లే అంటూ ఓపెన్​గా చెప్పడం స్టార్ట్ చేశారు. 

స్వదేశంలో లేని TikTok లో ఇలాంటి వీడియోలు మిలియన్ వ్యూస్ సాధించడంతో.. ఇండియాలో ఇన్​స్టాగ్రామ్​లో చేసి.. లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు. వారికి మద్ధతు ఇస్తూ చాలామంది "సేమ్", "నా లవ్ స్టోరి కూడా ఇదే " అంటూ కామెంట్ల ద్వారా తమ మద్ధతు ఇస్తన్నారు. ఈ ట్రెండ్‌కి Gen Zలు Shrekking అనే ఫన్నీ నేమ్ పెట్టారు. అయితే వినడానికి ఫన్నీగా ఉన్నా.. దానివెనుక ఎంతో బాధ కూడా ఉందని పోస్ట్​ల రూపంలో చెప్తున్నారు. 

Shrek పేరుకి డేటింగ్​కి లింక్ ఏంటి?

షెర్క్ అనే పాత్రతో ఓ ఫేమస్ క్యారెక్టర్ ఉంది. అది చూసేందుకు వికారంగా ఉంటుంది కానీ.. హార్ట్ మాత్రం గోల్డ్. నిజాయితీగా, నమ్మకంగా, ప్రేమగా ఉంటాడు. ఆ పాత్ర స్ఫూర్తితోనే ఈ ట్రెండ్‌కి Shrekking అని పేరు పెట్టారు. అంటే చూసేందుకు అంత గొప్పగా లేకున్నా.. వాళ్ల హార్ట్ అన్నింటికంటే మిన్నా.. అలాంటి వారితో డేటింగ్ చేయడం తప్పు కాదనే అర్థాన్ని వారు చెప్తున్నారు. 

Gen Z దీనిని ఎందుకు హైలెట్ చేస్తోంది?

ఈ తరం డేటింగ్లో సిచ్యూవేషన్ షిప్, గోస్టింగ్, బ్రెడ్​ క్రంబింగ్ వంటివి వాటితో అందం వెనక పడుతున్నామని భావించిన జెన్​ జి.. వారితో ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడాన్ని హైలెట్ చేసింది. కాబట్టి అందమైన వ్యక్తితో డేటింగ్ చేసినా ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఆ బంధానికి అర్థం లేదని.. అందంగా లేని వ్యక్తి మనసు బాగుంటే.. ఎమోషనల్​గా వారు సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నారు. 

ఇన్​స్టాగ్రామ్​లోని ఫిల్టర్​లతో, మేకప్​లతో మోసపోయామని.. చూసేందుకు పర్​ఫెక్ట్​గా ఉన్నా.. మానసికంగా వారితో కలిసి ఉండలేమని.. ఈ ట్రెండ్​ని హైలెట్​ చేస్తున్నారు. చూడడానికి నచ్చిన వ్యక్తితో ఉన్నా.. ఎమోషనల్​గా చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతున్నారట. పైగా వారినుంచి ఎలాంటి మోరల్ సపోర్ట్ లేకపోవడంతో.. జెన్​ జీలు తమకు ఎమోషనల్​గా సపోర్ట్ ఇచ్చేవారికోసం ఎదురు చూస్తున్నారట. అందుకే ఆ వ్యక్తి ఎంత అందంగా ఉన్నారని కాకుండా.. తమకోసం ఎంత పరితపిస్తున్నారో చూస్తున్నారట. 

ష్రెక్కింగ్ డేటింగ్​తో లాభాలు.. 

ఈ డేటింగ్​లో ఫీలింగ్స్​కి ప్రయారటీ ఇస్తారు. అలాగే అందానికి అట్రాక్ట్ అయ్యే డేటింగ్ ట్రెండ్స్ నుంచి బయటపడుతున్నారు. మీ పార్టనర్​ మీ ఫీలింగ్స్​ని రెస్పెక్ట్ చేసి.. ఎమోషనల్​గా అందుబాటులో ఉంటారు. దీంతో మీ రిలేషన్​ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 

మరి నష్టాలు ?

ప్రతి డేటింగ్​కి నెగిటివ్​ సైడ్ ఉన్నట్టే దీనికి కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఎమోషనల్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ.. ఎవరు కాస్త జాలీ చూపించినా మంచి అనుకునే అవకాశం ఉంది. దానిని అవతలి వారు క్యాష్ చేసుకోవచ్చు. అలాగే అందంగా లేనివారంతా మంచివారు అనుకోవడం తప్పు. అందంగా ఉంటే ఎమోషనల్​గా సపోర్ట్ చేయరు అనుకోవడం కూడా తప్పే అవుతుంది. కొన్ని సందర్భాల్లో వారిని తక్కువగా చూసే అవకాశముంది. జెన్యూన్​గా అవతలివారిపై ఫీల్​ లేకుండా సపోర్ట్ కోసం వాడుకుంటే అది ఎక్కువకాలం నిలవదు. 

రూపం అనేది మంచితనాన్ని నిర్ణయించదు. అందంగా ఉన్నా లేకపోయినా ఎవరైనా మంచి లేదా చెడు పార్టనర్ కావచ్చు. కానీ Shrekking చెప్పేది ఏమిటంటే.. ప్రేమ కేవలం బాహ్య రూపంపై ఆధారపడి ఉండదు. నమ్మకం, గౌరవం, సమయం ఇవ్వడంపైనే ఉంటుందని చెప్తోంది. ఇది అర్థం చేసుకుంటే అందంగా ఉన్నా లేకున్నా నిజమైన ప్రేమను పొందవచ్చు. ఇవ్వవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget