అన్వేషించండి

Smoking vs Vaping : స్మోకింగ్, వేపింగ్ రెండూ ఒకటేనా? తేడాలు ఏంటి? వీటిపై ఇండియాలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి?

Vaping vs Smoking Health Risks : స్మోకింగ్, వేపింగ్ రెండూ ఒకటే అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నిజం ఏంటి? వీటి మధ్య తేడాలు? ఏది అత్యంత ప్రమాదమో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పొగాకు కాల్చడం, వేపింగ్ చేయడం రెండూ శరీరానికి హానికరమే.
  • స్మోకింగ్​లో 4,000 రసాయనాలు, 70 క్యాన్సర్ కారకాలు ఉంటాయి.
  • వేపింగ్ ఆవిరిలో కూడా ఊపిరితిత్తులను దెబ్బతీసే రసాయనాలున్నాయి.
  • వేపింగ్ తక్కువ హానికరం కానీ సురక్షితం కాదు.

Key Differences of Vaping vs Smoking : కొందరు వేపింగ్ చేస్తున్నాను కాబట్టి సిగరెట్టు మానేయగలిగాను.. ఇప్పుడు నేను సేఫ్‌ అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే స్మోకింగ్, వేపింగ్ రెండూ వేర్వేరు పద్ధతులే అయినా.. రెండూ శరీరానికి హాని చేస్తాయి. కేవలం తేడా ఏదైనా ఉంది అంటే.. హాని చేసే తీరు వేరుగా ఉంటుంది. అవేంటో పూర్తిగా తెలుసుకుందాం.

స్మోకింగ్ అంటే 

పొగాకు కాల్చడం ద్వారా వచ్చే పొగను పీల్చడమే స్మోకింగ్. సిగరెట్టు, బీడీ, సిగార్ ఇవన్నీ స్మోకింగ్ కోవకు వస్తాయి. పొగాకు వెలిగించినప్పుడు 4,000కు పైగా రసాయనాలు విడుదలవుతాయి. వాటిలో 70కి పైగా క్యాన్సర్ కారకాలు ఉంటాయి.

వేపింగ్ అంటే 

బ్యాటరీతో నడిచే పరికరంలో లిక్విడ్‌ను వేడి చేసి ఆవిరి రూపంలో పీల్చడమే వేపింగ్. ఈ లిక్విడ్‌లో నికోటిన్, సువాసన రసాయనాలు, ప్రొపిలీన్ గ్లైకాల్ ఉంటాయి. పొగ లేదు కాబట్టి హాని లేదు అనుకుంటారు చాలామంది. కానీ ఆవిరిలో కూడా హానికరమైన రసాయనాలు ఉంటాయి.

స్మోకింగ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు..

పొగాకు కాలినప్పుడు వచ్చే టార్, కార్బన్ మోనాక్సైడ్ ఊపిరితిత్తులను నేరుగా దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో లంగ్ క్యాన్సర్, COPD వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. రక్తనాళాలు గట్టిపడతాయి, గుండెపోటు ప్రమాదం చాలా అధికంగా ఉంటుంది.

వేపింగ్ వల్ల వచ్చే సమస్యలు

వేపింగ్​లో టార్ ఉండదు కానీ.. ఆవిరిలోని కెమికల్స్ ఊపిరితిత్తుల లోపలి పొరను దెబ్బతీస్తాయి. EVALI అనే ప్రత్యేక వ్యాధి వేపింగ్ వల్లనే వస్తుందని వైద్య నిపుణులు నిర్ధారించారు. నికోటిన్ వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తపోటు పెరుగుతుంది. గుండె సమస్యలు తక్కువ కాలంలోనే వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

స్మోకింగ్, వేపింగ్ కూడా నికోటిన్ ద్వారా మెదడును ప్రభావితం చేస్తాయి. అయితే వేపింగ్‌లో నికోటిన్ మోతాదు అధికంగా ఉండవచ్చు కాబట్టి యువతలో మెదడు అభివృద్ధి మరింత దెబ్బతింటుంది. అది వ్యసనంగా మారుతుంది. రెండింటిలోనూ నికోటిన్ ఉన్నందున వ్యసనం తప్పదు. వాపింగ్‌లో సువాసనలు, ఆకర్షణీయంగా ఉండి యువత మరింత వేగంగా వేపింగ్​ వ్యసనానికి లోనవుతున్నారు.

వేపింగ్ స్మోకింగ్ కంటే సేఫా?

ఈ ప్రశ్నకు వైద్య నిపుణుల సమాధానం "వేపింగ్ స్మోకింగ్ కంటే తక్కువ హానికరం అని చెప్పవచ్చు. కానీ సురక్షితం అని మాత్రం చెప్పలేం!" అంటున్నారు. స్మోకింగ్‌తో పోల్చితే వేపింగ్‌లో రసాయనాల సంఖ్య తక్కువ. కానీ వేపింగ్ కొత్తది కాబట్టి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఎక్కువగానే ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని తీవ్రమైన సమస్యలు వెలుగులోకి రావచ్చు. కాబట్టి సిగరెట్టు మానడానికి వేపింగ్ చేయడం మంచిది కాదని అంటున్నారు. సిగరెట్టు మానాలంటే వైద్యుని సలహాతో నికోటిన్ పాచెస్, కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. 

ఇండియాలో రూల్స్..

స్మోకింగ్ పబ్లిక్ ప్రదేశాల్లో నిషేధం. కానీ వ్యక్తిగత వినియోగం చేసుకోవచ్చు. వేపింగ్ 2019లో పూర్తిగా నిషేధించారు. దీని తయారీ, విక్రయం, దిగుమతి అన్నీ చట్టవిరుద్ధమే. మొదటిసారి పట్టుబడితే 1 లక్ష జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Healthy Habits : రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే
రోజుకు 10 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సింపుల్ అలవాట్లు ఇవే
Kalonji Oil : కలొంజీ ఆయిల్ జుట్టుకు ఉపయోగిస్తే కలిగే లాభాలు ఏంటి? ఎలా వాడాలో తెలుసా?
కలొంజీ ఆయిల్ జుట్టుకు ఉపయోగిస్తే కలిగే లాభాలు ఏంటి? ఎలా వాడాలో తెలుసా?
Late-Night Eating : రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
రాత్రి భోజనం.. నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? గ్యాస్ట్రో వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Backward Walking : వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎప్పుడు, ఎంత సేపు నడిస్తే మంచిది?
వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎప్పుడు, ఎంత సేపు నడిస్తే మంచిది?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
Embed widget