అన్వేషించండి

Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే

Brain Stroke Warning Signs : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఇది రావడానికి కారణాలు ఏంటి? ఎలా గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెదడుకు రక్త సరఫరా ఆగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది.
  • ముఖం వంగడం, చేతులు బలహీనంగా ఉండటం, మాట తడబడటం లక్షణాలు.
  • FAST టెక్నిక్ లక్షణాలను గుర్తించి, వెంటనే వైద్య సహాయం అందిస్తుంది.
  • స్ట్రోక్ తర్వాత తొలి గంటలు (గోల్డెన్ పీరియడ్) చాలా కీలకం.

Golden Hour in Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత తీవ్రమైన, అత్యవసర వైద్య పరిస్థితి. ఇది హఠాత్తుగా వస్తుంది. ముందుగా ఎటువంటి హెచ్చరిక సంకేతాలు మీరు గుర్తించకపోవచ్చు. అయితే మెదడు పక్షవాతం వచ్చే ముందు శరీరం కొన్ని సూచనలు ముందే ఇస్తుందని చెప్తున్నారు నిపుణులు. వాటిని సకాలంలో గుర్తిస్తే ప్రాణాన్ని కాపాడవచ్చు. దీర్ఘకాలిక వైకల్యాలను నివారించవచ్చు. మరి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏంటి? దానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెయిన్ స్ట్రోక్ 

మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా మెదడులో రక్తనాళం పగిలిపోవడం వల్ల స్ట్రోక్ వస్తుంది. రక్తం అందకపోవడంతో మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందవు. కేవలం కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం మొదలవుతాయి. అందుకే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అత్యంత అవసరం.

స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ..

కొన్ని ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి అలవాట్లు స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయని చెప్తున్నారు నిపుణులు. అధిక రక్తపోటు రక్తనాళాలపై అదనపు ఒత్తిడి వేసి అది పగిలిపోవడానికి కారణమవుతుంది. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. పొగతాగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. గుండె ఆరోగ్యం క్షీణించి.. మెదడుపై ప్రభావం చూపిస్తుంది. పై సమస్యలు ఉన్నవారు స్ట్రోక్ లక్షణాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
స్ట్రోక్ లక్షణాలు

మాట్లాడడంలో ఇబ్బంది : హఠాత్తుగా మాటలు తడబడడం, మాటను కంప్లీట్ చేయలేకపోవడం, ఇతరులకు చెప్పేది అర్థం కాకపోవడం వంటివి స్ట్రోక్ స్పష్టమైన సంకేతాలు.

ముఖంలో మార్పులు : ముఖం ఒక వైపు వాలిపోవడం లేదా సమానంగా లేకపోవడం గమనించవచ్చు. నవ్వమని చెప్పినప్పుడు ముఖం ఒక వైపే లాగుతుంది.

చేయి లేదా కాలు బలహీనత : శరీరంలో ఒక వైపు మాత్రమే చేయి లేదా కాలు బలహీనంగా అనిపించడం, తిమ్మిరి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక్క వైపే అలా అనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. చేయి పైకి లేపలేకపోవడం కూడా ముఖ్యమైన సంకేతం.

ఇతర లక్షణాలు

హఠాత్తుగా కళ్లు బైర్లు కమ్మడం, లేదా వస్తువులు రెట్టింపుగా కనిపించడం, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, నిలబడడంలో సమస్య, గందరగోళంగా అనిపించడం కూడా బ్రెయిన్ స్ట్రోక్ని తెలిపే సంకేతాలు. 

FAST టెక్నిక్..

స్ట్రోక్ లక్షణాలు గుర్తించడానికి FAST టెక్నిక్ని సులభమైన పద్ధతిగా చెప్తారు. FASTలోని అక్షరాలే.. లక్షణాలకు సంకేతాలు. అంటే F-Face ముఖం వంగిపోవడం A-Arms చేతులు పైకి లేపలేకపోవడం.. S-Speech మాటలు తడబడటం T-Time వెంటనే 108కి కాల్ చేయడం.

గోల్డెన్ పీరియడ్

స్ట్రోక్ చికిత్సలో సమయం అత్యంత కీలకం. లక్షణాలు మొదలైన తొలి గంటలను "గోల్డెన్ పీరియడ్" అంటారు. ఈ సమయంలో సరైన వైద్య సహాయం అందితే మెదడుకు జరిగే నష్టం గణనీయంగా తగ్గుతుంది. కోలుకునే అవకాశం పెరుగుతుంది. ఆలస్యం చేస్తే పక్షవాతం, మాట్లాడలేకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి శాశ్వత వైకల్యాలు వస్తాయి. కనుక తొలి లక్షణం కనిపించిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం మంచిది. 

స్ట్రోక్ రాకుండా నివారించే మార్గాలు

చాలావరకు స్ట్రోక్ కేసులు సరైన జీవనశైలితో నివారించవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలి. నూనె, ఉప్పు, చక్కెర తక్కువగా వాడాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయడం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. పొగతాగడం పూర్తిగా మానేయండి. మద్యపానం తగ్గించుకోండి లేదా మానేయండి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిది. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ చేసుకోవాలి. 

బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో ప్రతి సెకను విలువైనది. లక్షణాలు గుర్తించడం, వెంటనే చర్య తీసుకోవడం వల్ల ప్రాణాన్ని కాపాడవచ్చు. FAST పద్ధతి గుర్తుపెట్టుకుని.. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే.. ప్రాణాపాయ స్థితి రాకుండా జాగ్రత్త పడవచ్చు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget