బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ తినాల్సిన ఫుడ్స్.. రాకూడదనుకుంటే కూడా తీసుకోవచ్చు

Published by: Geddam Vijaya Madhuri

పాలకూర, కేల్, మెంతి వంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా ఉంచుతాయి.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీల్లో విటమిన్ C, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కణాల నష్టం తగ్గించడంలో సహాయపడతాయి.

ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమలు ఫైబర్ ఎక్కువగా ఇస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

పప్పులు, శనగలు, గుడ్లు, చేపలు శరీరానికి శక్తి ఇస్తాయి, టిష్యూల రిపేర్‌కు సహాయపడతాయి.

డ్రై ఫ్రూట్స్, బాదం, వాల్‌నట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

టమాటాల్లో లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ సెల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తారు.

క్యారట్ & బీట్‌రూట్లలో బీటా కెరోటిన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని బలపరుస్తాయి.

గ్రీన్ టీలోని పాలీఫినాల్స్ వల్ల యాంటీఆక్సిడెంట్ ప్రయోజనం లభిస్తుంది.

వెల్లుల్లి, ఉల్లి ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడే సమ్మేళనాలు కలిగి ఉంటాయి.

ఆపిల్, పుచ్చకాయ, జామ, స్ట్రాబెర్రీ వంటి పండ్లు విటమిన్స్, ఫైబర్ అందిస్తాయి.