పుచ్చకాయ రాత్రుళ్లు తింటే మంచిదా? కాదా?

Published by: Geddam Vijaya Madhuri

రాత్రి సమయంలో మెటాబాలిజం స్లోగా ఉంటుంది. పుచ్చకాయలో జీర్ణమయ్యేందుకు ఆలస్యమవుతుంది.

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ. దీని వల్ల తరచూ మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది.

Published by: Geddam Vijaya Madhuri

రాత్రి తింటే కొందరికి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు రావచ్చు.

పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ లెవల్స్ పెరగవచ్చు.

రాత్రి తీసుకునే కేలరీలు సరిగ్గా బర్న్ కావు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకంటే తినకండి.

రాత్రి పుచ్చకాయ తింటే శరీరంలో చల్లదనం పెరిగి కొందరికి జలుబు, గొంతు సమస్యలు రావచ్చు.

డిన్నర్ తర్వాత వెంటనే పుచ్చకాయ తింటే జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది.

ఉదయం 10–12 మధ్య లేదా మధ్యాహ్నం 2–4 మధ్య తింటే శరీరానికి మంచిది.

తినాలనుకుంటే రాత్రుళ్లు చిన్న మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తినకూడదు.

డయాబెటిస్, జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి పుచ్చకాయ తినకపోవడమే మంచిది.