సమ్మర్లో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందా? కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా తక్కువగా ఉండాలి. లేదంటే అధిక వేడి వల్ల స్పెర్మ్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది.

వేడి ఎక్కువైతే స్పెర్మ్ క్వాలిటీ, మోటిలిటీ, ఆకృతి ప్రభావితం కావచ్చు.

డీహైడ్రేషన్ వల్ల స్పెర్మ్ హెల్త్‌పై కూడా ప్రభావం పడుతుంది.

టైట్ అండర్‌వేర్ లేదా జీన్స్ ధరించడం వల్ల వృషణాల వద్ద ఉష్ణోగ్రత పెరిగి స్పెర్మ్ ఉత్పత్తి తగ్గవచ్చు.

బాగా వేడి ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తాత్కాలికంగా తగ్గుతుంది.

ల్యాప్‌టాప్ హీట్ వల్ల కూడా ఉష్ణోగ్రత పెరిగి స్పెర్మ్ హెల్త్ దెబ్బతినవచ్చు.

సోడాలు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే హార్మోన్లను అసమతుల్యం చేసి స్పెర్మ్ క్వాలిటీ తగ్గించవచ్చు.

వేడి వల్ల నిద్రలేమి, స్ట్రెస్ పెరిగి హార్మోన్ స్థాయిలపై ప్రభావం చూపి ఫర్టిలిటీ తగ్గించవచ్చు.

సరైన ఆహారం తీసుకోకపోతే జింక్, విటమిన్ C, E వంటి పోషకాలు తగ్గి స్పెర్మ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

వదులుగా ఉండే దుస్తులు ధరించడం, నీరు తాగడం, హెల్తీ డైట్, వేడి నుంచి దూరంగా ఉంటూ స్పెర్మ్ హెల్త్‌ను కాపాడుకోవచ్చు.