పసుపు పళ్లు తెల్లగా మారాలా? ఇంట్లోనే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Published by: Geddam Vijaya Madhuri

బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి వారానికి 1–2 సార్లు బ్రష్ చేస్తే పసుపుదనం తగ్గుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నూనెను నోట్లో 10–15 నిమిషాలు గార్గిల్ చేయడం వల్ల దంతాలు తెల్లగా మారడంలో సహాయపడుతుంది.

కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి దంతాలపై రుద్దితే స్టెయిన్స్ తగ్గుతాయి.

యాపిల్ సైడర్ వెనిగర్ నీటిలో కలిపి మౌత్ రిన్స్‌గా వాడితే బ్యాక్టీరియా తగ్గి దంతాల రంగు మెరుగవుతుంది.

స్ట్రాబెర్రీని ముద్దలా చేసి దంతాలపై రుద్దితే నేచురల్ వైటెనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది.

వారానికి ఒకసారి యాక్టివేటెడ్ చార్కోల్‌తో బ్రష్ చేస్తే టాక్సిన్స్, మచ్చలు తొలగుతాయి.

వేపకర్రతో పళ్లు తోమడం పాతకాలం నుంచే ఉంది. ఇది బ్యాక్టీరియాను తగ్గించి దంతాలను శుభ్రంగా ఉంచుతుంది.

క్యారెట్, ఆపిల్ వంటి ఫైబర్ ఫుడ్స్ క్లీనర్‌లా పని చేసి పళ్లు శుభ్రంగా, తెల్లగా ఉండేందుకు సహాయపడతాయి.

కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఈ టిప్స్‌ను మితంగా పాటించాలి. ఎక్కువగా వాడితే పళ్ల ఎమల్షన్‌కు నష్టం కలుగుతుంది.