వేసవిలో నెయ్యి తినొచ్చా? లాభమా? నష్టమా?

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో నెయ్యి పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువగా తినకుండా మితంగా తీసుకోవాలి.

నెయ్యిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎనర్జీని అందిస్తాయి.

నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే జీర్ణం సులభంగా అవుతుంది.

ఆయుర్వేదం ప్రకారం నెయ్యి శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

నెయ్యిలో ఉండే పోషకాలు చర్మాన్ని మృదువుగా ఉంచి డ్రైనెస్ తగ్గిస్తాయి.

ఎక్కువగా నెయ్యి తీసుకుంటే శరీరంలో వేడి పెరిగి అసౌకర్యం కలుగుతుంది.

నెయ్యి ఎక్కువ కాలరీలు కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తింటే వెయిట్ గెయిన్ అవుతుంది.

అధికంగా తింటే అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.

ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే మంచిది. రాత్రి ఎక్కువగా తినకపోవడం మంచిది.

ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఆరోగ్యానికి మంచిది.