సమ్మర్లో పిల్లలను ఆరోగ్యంగా ఉంచే టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో పిల్లలు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. కాబట్టి తరచూ నీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలు ఇవ్వాలి.

జంక్ ఫుడ్ తగ్గించి పండ్లు, కూరగాయలు, పెరుగు వంటి పోషకాహారం ఇవ్వాలి.

మధ్యాహ్నం 11 నుంచి 4 మధ్య బయట ఆడనివ్వకండి. ఈ సమయంలో హీట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.

పిల్లలకు గాలి ఆడే, తేలికపాటి కాటన్ దుస్తులు వేయించడం మంచిది.

రోజుకు 1-2 సార్లు స్నానం చేయించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.

బయటకు వెళ్తే టోపీ, సన్‌గ్లాసెస్ లేదా చిన్నపిల్లలకు సన్‌స్క్రీన్ వాడాలి.

పిల్లలు సరిపడా నిద్రపోతే శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది.

చెమట వల్ల పోయే ఎలక్ట్రోలైట్స్ కోసం ORS, నిమ్మరసం, మజ్జిగ ఇవ్వాలి.

మొబైల్, టీవీ ముందు ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ఇండోర్ గేమ్స్ ప్రోత్సహించండి.

అలసట, తల తిరగడం, వాంతులు ఉంటే వెంటనే చల్లని ప్రదేశంలో ఉంచి డాక్టర్‌ను సంప్రదించాలి.