ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు రాకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్

Published by: Geddam Vijaya Madhuri

ఉల్లిపాయలు కోసే ముందు 20–30 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టితే గ్యాస్ విడుదల తగ్గి కళ్లకు ఇబ్బంది తగ్గుతుంది.

మందమైన కత్తితో కోస్తే ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కాబట్టి షార్ప్ నైఫ్ వాడితే కట్ క్లీన్‌గా అవుతుంది.

ఉల్లిపాయ వేరు దగ్గరే ఎక్కువగా కంటికి ఇబ్బంది కలిగించే కంపౌండ్స్ ఉంటాయి. అందుకే దాన్ని చివర్లో కట్ చేయండి.

నీటి టాప్ దగ్గర లేదా నీటిలో కాసేపు ఉంచి కోస్తే గ్యాస్ నీటిలో కలిసిపోతుంది.

వెంటిలేషన్ ఉండేలా చూడండి. ఫ్యాన్ లేదా కిటికీ దగ్గర కోస్తే గ్యాస్ త్వరగా తగ్గుతుంది.

గాగుల్స్ లేదా గ్లాసెస్ వాడండి. కళ్లను కవర్ చేస్తే గ్యాస్ కళ్లలోకి వెళ్లదు.

ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా శ్వాస తీసుకుంటే కంటికి వచ్చే ఇబ్బంది తగ్గుతుంది.

కత్తిపై కొద్దిగా వినిగర్ లేదా నిమ్మరసం రాస్తే గ్యాస్ ప్రభావం తగ్గుతుంది.

కట్ చేసిన ఉల్లిపాయలను మీ దగ్గర ఎక్కువసేపు ఉంచకుండా దూరంగా పెట్టండి.