సమ్మర్లో భోజనం మానేస్తే కలిగే ఇబ్బందులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

తినకపోతే శరీరానికి అవసరమైన ఇంధనం అందదు. దీంతో అలసట, బలహీనత వస్తాయి.

ఆహారం ద్వారా కూడా కొంత నీరు శరీరానికి అందుతుంది. భోజనం మానేస్తే డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది.

తినకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పడిపోవచ్చు. తల తిరగడం, బలహీనంగా ఫీల్ అవడం జరుగుతుంది.

భోజనం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయి తగ్గి హైపోగ్లైసీమియా వచ్చే అవకాశం ఉంది.

సరైన పోషకాలు లేకపోతే శరీరం వేడిని తట్టుకోలేకపోతుంది. ఇది Heat Stroke ప్రమాదాన్ని పెంచుతుంది.

లాంగ్ గ్యాప్ వల్ల గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ సమస్యలు వస్తాయి.

ప్రోటీన్, న్యూట్రియంట్స్ లేకపోతే కండరాలు బలహీనమవుతాయి.

తినకపోతే చిరాకు, కోపం, టెన్షన్ ఎక్కువవుతుంది.

భోజనం స్కిప్ చేస్తే శరీరం ఎనర్జీ సేవ్ చేయడానికి మెటబాలిజం తగ్గిస్తుంది.

వింతగా అనిపించినా, ఎక్కువసేపు తినకపోతే తర్వాత ఓవర్ ఈటింగ్ చేసి బరువు పెరిగే అవకాశం ఉంది.