రోజూ 30 నిమిషాలు నడిస్తే శరీరంలో వచ్చే మార్పులు

Published by: Geddam Vijaya Madhuri

నడక వల్ల గుండె బలపడుతుంది. రక్తప్రసరణ సరిగా జరిగి, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

రోజూ నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. దీని వల్ల క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.

డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారికి నడక సహజమైన మందులా పనిచేస్తుంది.

భోజనం తర్వాత నడిస్తే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి.

నడక వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. మెదడులో హ్యాపీ హార్మోన్లు విడుదలై మూడ్ బెటర్ అవుతుంది.

నడక వల్ల కాళ్ల కండరాలు, మోకాళ్లు బలంగా మారతాయి. జాయింట్ పెయిన్ తగ్గుతుంది.

రోజూ నడిచే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. జలుబు, జ్వరాలు తగ్గుతాయి.

నడక వల్ల శరీరం అలసిపోతుంది. దీంతో రాత్రి మంచి నిద్ర వస్తుంది.

దీర్ఘకాలిక వ్యాధులు తగ్గి, జీవన కాలం పెరుగుతుంది.