వేసవిలో ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

ఐస్ క్రీమ్‌లో షుగర్, ఫ్యాట్ ఎక్కువగా ఉండటంతో త్వరగా బరువు పెరుగుతారు.

చల్లటి పదార్థం ఎక్కువగా తినడం వల్ల గొంతు నొప్పి, జలుబు రావచ్చు.

డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగవచ్చు.

కొంతమందికి కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు రావచ్చు.

షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొటిమల సమస్యలు పెరగవచ్చు.

చల్లటి పదార్థం వల్ల టీత్ సెన్సిటివిటీ, కేవిటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

షుగర్ ఎక్కువగా తీసుకుంటే మొదట ఎనర్జీ పెరిగినట్టు అనిపించినా తరువాత అలసట వస్తుంది.

ఫ్యాట్ ఎక్కువగా ఉండటంతో చెడు కొవ్వు పెరిగే అవకాశం ఉంది.

చల్లటి ఫుడ్ తిన్నప్పుడు దాహం తగ్గినట్టు అనిపించినా… శరీరానికి అవసరమైన నీరు తగ్గవచ్చు.

తీపి పదార్థాలు ఎక్కువగా తింటే మరింత తినాలని అనిపిస్తుంది.