రోజూ 10,000 అడుగులు నడిస్తే.. నెలరోజుల్లో జరిగే మార్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

రోజూ నడవడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి. దీంతో క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

నడక వల్ల రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. దీంతో హార్ట్ డిసీజ్ ప్రమాదం తగ్గుతుంది.

రెగ్యులర్ వాకింగ్ వల్ల హై బీపీ తగ్గడంలో సహాయం చేస్తుంది.

నడక వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.

వాకింగ్ వల్ల ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఇవి మూడ్‌ను మెరుగుపరుస్తాయి.

రోజూ నడిస్తే రాత్రి బాగా నిద్రపోతారు. నిద్ర నాణ్యత మెరుగవుతుంది.

కాళ్ల కండరాలు బలపడతాయి. శక్తి, స్టామినా కూడా పెరుగుతుంది.

భోజనం తర్వాత నడిస్తే డైజెషన్ బాగా జరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.

రక్తప్రసరణ మెదడుకు కూడా పెరగడంతో ఫోకస్, మెమరీ మెరుగవుతాయి.

ఒక్కసారిగా 10,000 అడుగులు కాకుండా క్రమంగా పెంచండి. సరైన షూస్ వేసుకోవాలి.