బాదం తొక్క తీసి తినాలా? లేక తొక్కతోనే తినాలా? ఏది మంచిది

Published by: Geddam Vijaya Madhuri

బాదం తొక్కలోనే ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి తొక్కతో తినడం మంచిది.

తొక్క తీసిన బాదం జీర్ణం అవ్వడం సులభం. ఇవి పిల్లలు, వృద్ధులకు మంచిది.

బాదం తొక్కలో ఫ్లేవనాయిడ్స్ ఉండి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి.

తొక్కతో ఉన్న బాదం ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. బరువు తగ్గుతారు.

తొక్కతో ఉన్న బాదం కాస్త గట్టిగా ఉంటుంది. తొక్క తీసినవి మృదువుగా ఉంటాయి.

నానబెట్టి తొక్క తీసి తింటే కొంతమంది చెబుతున్నట్టు పోషకాలు త్వరగా అబ్జార్బ్ అవుతాయి.

బాదం తొక్కలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు స్కిన్‌కు మంచివి.

కొందరికి తొక్క జీర్ణం కావడం కష్టం. అప్పుడు తొక్క తీసి తినడం మంచిది.

ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ వల్ల రెండు విధాల బాదం కూడా ఎనర్జీ ఇస్తాయి.

రోజూ 4–6 బాదం నానబెట్టి తినడం మంచిది. మీ బాడీకి ఏది సూట్ అవుతుందో దానిని ఫాలో అవడం బెస్ట్ .