నరాలపై మధుమేహం ప్రభావం.. ఈ లక్షణాలు విస్మరించకండి

Published by: Geddam Vijaya Madhuri

చేతులు, కాళ్లు మొద్దుబారతాయి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే నరాలు దెబ్బతిని సెన్సేషన్ తగ్గుతుంది.

గుచ్చినట్టుగా లేదా కాలుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా పాదాల్లో కాలుతున్నట్టు అనిపిస్తుంది.

తీవ్ర నొప్పిగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక్కసారిగా కత్తితో గుచ్చినట్టుగా నొప్పి వస్తుంది.

మసిల్స్ బలహీనపడతాయి. నరాలు బలహీనపడితే కండరాల శక్తి తగ్గుతుంది.

బ్యాలెన్స్ సమస్యలు పెరుగుతాయి. కాళ్లలో ఫీలింగ్ తగ్గడం వల్ల నడుస్తూ జారి పడే అవకాశం ఉంటుంది.

స్పర్శకు ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుంది. చిన్నగా తాకినా కూడా ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది.

జీర్ణక్రియ సమస్యలు పెరుగుతాయి. నరాలపై ప్రభావం వల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వస్తాయి.

పాదాల సమస్యలు, గాయాలు అవుతాయి. గాయాలు తెలిసికాకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.

లైంగిక సమస్యలు పెరుగుతాయి. నరాల దెబ్బతినడం వల్ల రక్తప్రసరణ తగ్గి సమస్యలు వస్తాయి.

గాయాలు తగ్గవు. నరాల పనితీరు తగ్గడం వల్ల గాయాలు త్వరగా మానవు.

Diabetic neuropathyను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నియంత్రించుకోవచ్చు.