రోజూ 1 నిమిషం ప్లాంక్ చేస్తే కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కడుపు, వెన్నెముక, నడుము భాగాలు బలపడతాయి.

బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. మెటాబాలిజాన్ని పెంచి కొవ్వు కరిగిస్తుంది.

పోష్చర్ మెరుగవుతుంది. నిటారుగా నిలబడటం, కూర్చోవడం సులభమవుతుంది.

బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. వెన్ను భాగానికి సపోర్ట్ ఇచ్చి నొప్పులను తగ్గిస్తుంది.

ఫుల్ బాడీ వర్కౌట్ అవుతుంది. చేతులు, భుజాలు, కాళ్లు అన్ని మసిల్స్ పని చేస్తాయి.

బ్యాలెన్స్ & స్టెబిలిటీ మెరుగవుతుంది. శరీర నియంత్రణ పెరుగుతుంది.

మెటాబాలిజం బూస్ట్ అవుతుంది. రోజంతా ఎక్కువ కాలరీలు బర్న్ అవుతాయి.

ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. భుజాలు, కాళ్ల వెనుక భాగం లూజ్ అవుతాయి.

స్ట్రెస్ తగ్గిస్తుంది. ప్లాంక్ చేస్తున్నప్పుడు ఫోకస్ పెరిగి మైండ్ రిలాక్స్ అవుతుంది.

సులభమైన అలవాటు. ఎక్కడైనా, ఎప్పుడైనా జిమ్ అవసరం లేకుండా చేయవచ్చు.

మొదట 20–30 సెకండ్స్ నుంచి మొదలుపెట్టి… క్రమంగా 1 నిమిషం లేదా అంతకంటే ఎక్కువకు పెంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.