మూత్రం రంగు మారడం.. లివర్ క్యాన్సర్​కు సంకేతమా?

Published by: Geddam Vijaya Madhuri

డార్క్ యెల్లో, బ్రౌన్ లేదా టీ కలర్‌గా మారితే లివర్ సమస్యల సంకేతం కావచ్చు.

లివర్ సరిగా పని చేయకపోతే బిలిరుబిన్ స్థాయులు పెరిగి మూత్రం గాఢంగా మారుతుంది.

జాండిస్ వచ్చినప్పుడు కళ్ళు పసుపు రంగులోకి మారడంతో పాటు మూత్రం కూడా డార్క్‌గా ఉంటుంది.

లివర్ క్యాన్సర్ ఉంటే అలసట, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

నీరు తక్కువగా తాగితే కూడా మూత్రం గాఢంగా కనిపిస్తుంది. ఇది సాధారణమే.

బీట్‌రూట్, కొన్ని మందులు మూత్ర రంగును మార్చవచ్చు.

ఎక్కువ రోజులు పాటు రంగు మారి అలాగే ఉంటే, వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, స్కాన్ ద్వారా అసలు కారణం తెలుసుకోవాలి.

లివర్ సమస్యలు తొందరగా గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది.

మూత్రం రంగు మారితే.. భయపడకుండా, డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

మూత్రం రంగు మారడం అంటే తప్పనిసరిగా లివర్ క్యాన్సర్ అన్నది కాదు. కానీ అది శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక కావచ్చు.