రోజూ స్కిప్పింగ్ చేస్తే కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

రోప్ స్కిప్పింగ్ ఒక హై-ఇంటెన్సిటీ వ్యాయామం. కొద్దిసేపులోనే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి.

రెగ్యులర్‌గా స్కిప్పింగ్ చేస్తే కొవ్వు తగ్గి బరువు క్రమంగా తగ్గుతుంది.

ఇది ఒక మంచి కార్డియో వ్యాయామం. హార్ట్‌ను బలంగా ఉంచుతుంది.

రోజూ చేస్తే శరీరానికి స్టామినా పెరిగి అలసట తగ్గుతుంది.

కాలులు, చేతులు, భుజాలు, కోర్ ఇలా అన్ని కండరాలు పనిచేస్తాయి.

రెగ్యులర్ స్కిప్పింగ్ వల్ల బోన్ డెన్సిటీ మెరుగుపడుతుంది.

హ్యాండ్-ఐ, ఫుట్ కోఆర్డినేషన్ బాగా అభివృద్ధి చెందుతుంది.

వ్యాయామం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలై మూడ్ బాగుంటుంది.

జిమ్ అవసరం లేదు. ఇంట్లో లేదా బయట ఎక్కడైనా చేయవచ్చు.

రోజుకు 10 నుంచి 15 నిమిషాలు చేసినా మంచి ఫలితాలు పొందవచ్చు.