నెల రోజులు అన్నం తినకపోతే శరీరంలో జరిగే మార్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

బరువు తగ్గే అవకాశం ఉంది. కార్బోహైడ్రేట్స్ తగ్గడం వల్ల కాలరీలు తగ్గి బరువు తగ్గవచ్చు.

ఎనర్జీ తగ్గిపోవచ్చు. అన్నం ప్రధాన ఎనర్జీ సోర్స్ కాబట్టి అలసటగా అనిపించవచ్చు.

బ్లడ్ షుగర్ కంట్రోల్ మెరుగవచ్చు. రిఫైన్డ్ కార్బ్స్ తగ్గడం వల్ల షుగర్ లెవల్స్ స్టేబుల్ అవుతాయి.

ప్రోటీన్, ఫ్యాట్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైస్ తగ్గిస్తే ఇతర ఆహారాలపై ఆధారపడతారు.

అన్నం మానేసిన మొదట్లో మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు.

లో-కార్బ్ డైట్ వల్ల పొట్ట కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది.

మూడ్ స్వింగ్స్ రావచ్చు. కార్బ్స్ తగ్గితే సెరటోనిన్ ప్రభావం వల్ల మూడ్ మార్పులు ఉంటాయి.

క్రేవింగ్స్ పెరగవచ్చు. మొదటి కొన్ని రోజులు అన్నం తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.

న్యూట్రియంట్ గ్యాప్ వచ్చే అవకాశం ఎక్కువ. సరైన ప్రత్యామ్నాయాలు తీసుకోకపోతే పోషక లోపాలు రావచ్చు.

లైఫ్‌స్టైల్‌పై ఆధారపడి ఫలితాలు మారుతాయి. పూర్తిగా డైట్ బ్యాలెన్స్ ఉంటే ప్రయోజనం, లేకపోతే సమస్యలు.

అయితే అన్నం మొత్తానికి మానేయకుండా లిమిటెడ్గా తీసుకుంటే మంచిది.