నొప్పి, వాపును తగ్గించే ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉంటుంది. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

అల్లం శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. జాయింట్ పెయిన్‌కి ఉపశమనం ఇస్తుంది.

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచి వాపు తగ్గిస్తాయి.

పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.

వాల్నట్స్, బాదంలో ఓమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి.

గ్రీన్ టీలో ఉండే కంపౌండ్స్ శరీరాన్ని రక్షించి ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి.

టమోటాలో లైకోపిన్ ఉంటుంది. ఇది వాపు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది.

సాల్మన్, మాకరెల్ వంటి చేపల్లో ఓమెగా-3 ఎక్కువగా ఉంటుంది. ఇవి వాపు తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి.