మీకు తెలియని హై బీపీ లక్షణాలు ఇవే.. జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

తలనొప్పి.. ముఖ్యంగా ఉదయం లేవగానే తల బరువుగా ఉండటం హై బీపీ సంకేతం కావచ్చు.

తల తిరగడం.. తరచుగా తల తిరగడం లేదా బ్యాలెన్స్ కోల్పోవడం జరగవచ్చు.

ముక్కు నుంచి రక్తం రావచ్చు. ఇది బీపీ ఎక్కువగా ఉన్న సూచన కావచ్చు.

హృదయ స్పందన వేగంగా మారవచ్చు. గుండె వేగంగా కొట్టుకోవడం లేదా అనియంత్రితంగా మారుతుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. చిన్న పని చేసినా ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది.

హై బీపీ కళ్లపై ప్రభావం చూపిస్తుంది. కంటి చూపు మందగించవచ్చు.

అలసట ఎక్కువగా ఉంటుంది. చిన్న పనికే అలసిపోతారు.

చెవుల్లో శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. బజ్ లేదా హమ్ వంటి సౌండ్స్ రావచ్చు.

ఛాతిలో నొప్పి రావచ్చు. గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల ఇలా జరుగుతుంది.

ఆందోళన, యాంగ్జైటి పెరుగుతుంది. అనవసరంగా టెన్షన్ లేదా నెర్వస్‌గా అనిపిస్తుంది