వేసవిలో బాగా నిద్రపోవాలంటే పాటించాల్సిన టిప్స్

Published by: Geddam Vijaya Madhuri

గది చల్లగా ఉంచుకోండి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ ఉపయోగించి రూమ్ టెంపరేచర్ తగ్గించండి.

తేలికపాటి బెడ్‌షీట్లు ఉపయోగించండి. కాటన్ బెడ్‌షీట్లు, దుప్పట్లు వాడితే చెమట తక్కువగా పడుతుంది.

పడుకునే ముందు లైట్‌గా చల్లటి నీటితో స్నానం చేస్తే శరీరం కూల్ అవుతుంది.

రోజంతా సరిపడా నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్ వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది.

రాత్రి ఎక్కువగా లేదా ఆయిల్ ఫుడ్ తింటే శరీరం వేడి పెరిగి నిద్ర కష్టమవుతుంది.

లైట్, లూజ్ దుస్తులు వేసుకోండి. కాటన్, లూజ్ ఫిట్ డ్రెస్సులు వేసుకోవడం మంచిది.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తగ్గించండి. పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వాడకం తగ్గిస్తే మంచి నిద్ర వస్తుంది.

కాఫీ, టీ తగ్గించండి. సాయంత్రం తర్వాత కెఫీన్ తీసుకుంటే నిద్రకు అంతరాయం కలుగుతుంది.

వెంటిలేషన్ బాగా ఉండాలి. కిటికీలు తెరిచి గాలి సర్క్యులేషన్ ఉండేలా చూడండి.

రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ధ్యానం, డీప్ బ్రితింగ్ వంటి పద్ధతులు నిద్రకు సహాయపడతాయి.