ఆన్​లైన్​లో పరిచయమైన వ్యక్తితో డేట్‌కు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

మొదట్లో ఎక్కువగా పర్సనల్ వివరాలు షేర్ చేయకండి. నెమ్మదిగా పరిచయం పెంచుకోండి.

ఆ వ్యక్తి ప్రొఫైల్ నిజమో కాదో చూసేందుకు ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చెక్ చేయండి.

ఇంటి అడ్రెస్, బ్యాంక్ డీటెయిల్స్, ఆఫీస్ సమాచారం వంటి విషయాలు చెప్పకండి.

కలుసుకునే ముందు కనీసం ఒకసారి వీడియో కాల్ చేసి ఆ వ్యక్తి నిజమా కాదా తెలుసుకోండి.

మొదటి మీట్ ఎప్పుడూ రెస్టారెంట్ లేదా కేఫ్ లాంటి పబ్లిక్ ప్రదేశంలో ఉండాలి.

ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే వివరాలు మీ సన్నిహితులకు తెలియజేయండి.

వాళ్లపై ఆధారపడకుండా మీరే వెళ్లడం, రావడం ప్లాన్ చేసుకోవడం సేఫ్.

మీ డ్రింక్‌ను ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. అపరిచితుల నుండి తీసుకోకండి.

ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే ఆ ప్రదేశం వదిలి వెళ్లండి.

మీకు అసౌకర్యంగా అనిపిస్తే దానిని పట్టించుకోండి. సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వండి.