మెరిసే చర్మం కావాలా? సమ్మర్లో ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి

Published by: Geddam Vijaya Madhuri

పసుపు చిటికెడు, పాలు కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం నిగారింపు పెరుగుతుంది. మచ్చలు తగ్గుతాయి.

తేనె, నిమ్మరసం కలిపి రాసుకుంటే స్కిన్ బ్రైట్ అవుతుంది. ఇది నేచురల్ బ్లీచ్‌లా పని చేస్తుంది.

తాజా అలొవెరా జెల్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం మాయిశ్చరైజ్ అవుతుంది. గ్లో వస్తుంది.

రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే స్కిన్ సాఫ్ట్‌గా, హెల్తీగా ఉంటుంది.

పెరుగు, శనగపిండి కలిపి రాసుకుంటే డెడ్ స్కిన్ తొలగి చర్మం కాంతివంతంగా మారుతుంది.

రోజ్ వాటర్‌తో ముఖం కడిగితే స్కిన్ ఫ్రెష్‌గా ఉంటుంది. పోర్స్ క్లీన్ అవుతాయి.

కీరదోసకాయ ముక్కలను ముఖంపై రుద్దితే చల్లదనంతో పాటు చర్మం హైడ్రేట్ అవుతుంది.

బొప్పాయి, అరటి, ఆపిల్ వంటి పండ్లతో ఫేస్ ప్యాక్ చేస్తే నేచురల్ గ్లో వస్తుంది.

రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగితే స్కిన్ హైడ్రేట్ అయి నిగారింపు పెరుగుతుంది.

రోజుకు 7–8 గంటలు నిద్రపోతే స్కిన్ రీజెనరేషన్ బాగా జరిగి నేచురల్ గ్లో వస్తుంది.