Vaping(ఈ-సిగరెట్) వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు

Published by: Geddam Vijaya Madhuri

వేపింగ్ వల్ల EVALI అనే ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.

నికోటిన్ వల్ల హార్ట్‌రేట్ పెరిగి, బీపీ పెరిగి గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.

వేపింగ్‌లో ఉన్న నికోటిన్ బలమైన వ్యసనాన్ని కలిగిస్తుంది. ఒకసారి అలవాటు అయితే మానడం కష్టం.

నికోటిన్ మెదడు అభివృద్ధిని దెబ్బతీసి, మెమరీ, ఫోకస్ తగ్గిస్తుంది.

ఆందోళన, డిప్రెషన్, చిరాకు, నిద్రలేమి వంటి సమస్యలు పెరుగుతాయి.

చిగుళ్లు దెబ్బతినడం, గొంతు పొడిబారడం, నోటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

శరీర రోగనిరోధక శక్తి బలహీనమై ఇన్ఫెక్షన్లు త్వరగా పట్టేస్తాయి.

డీహైడ్రేషన్ వల్ల చర్మం పొడిబారి ముందుగానే ముడతలు వస్తాయి.

క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

వేపింగ్ సిగరెట్‌కు “సేఫ్ ఆల్టర్నేటివ్” కాదు. రెండూ ఆరోగ్యానికి హానికరమే.