Headache Triggering Points : తలనొప్పి తరచుగా, ఎక్కువగా వస్తోందా? ట్రిగరింగ్ పాయింట్స్ ఇవే కావొచ్చు, జాగ్రత్త
Headache : తలనొప్పి ఏదొక సమయంలో వస్తే పర్లేదు కానీ.. ఎక్కువసార్లు వస్తుందా? అయితే ఇవే దానికి కారణాలు కావొచ్చని అంటున్నారు. ఆ విషయాలను ఓవర్కామ్ చేసేయండి మరి.

Frequent Headaches Causes : అన్ని వయసులవారిని బాధించే ఆరోగ్య సమస్యల్లో తలనొప్పి ఒకటి. ఇది ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో వివిధ కారణాలతో వస్తూ ఉంటుంది. ఎప్పుడో ఓసారి తలనొప్పి వస్తే పర్లేదు. కానీ.. అస్తమాను వస్తేనే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఇది శరీరంలో జరిగే మార్పులను సూచిస్తుంది. లేదా బ్రెయిన్ ట్యూమర్ వంటి సమస్యకు సంకేతంగా తలనొప్పి రావొచ్చు. లేదంటే కొన్ని సింపుల్ రీజన్స్ వల్ల కూడా తరచూ తలనొప్పి వస్తుంది. ఇంతకీ తరచుగా వచ్చే తలనొప్పికి కారణాలు ఏంటో.. వాటిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
డీహైడ్రేషన్
శరీరానికి తగినంతగా నీటిని, ద్రవాలను అందిచనప్పుడు డీహైడ్రేషన్‌కి గురి అవుతుంది. దీనివల్ల మెదడు తాత్కలికంగా స్ట్రెస్ తీసుకుంటుంది. దీనివల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే డీహైడ్రేషన్ తలనొప్పికి ప్రధానకారణంగా చెప్తున్నారు నిపుణులు. కాబట్టి అలారం పెట్టుకుని అయినా సరే.. నీటిని శరీరానికి అందించాలని అంటున్నారు.
ఒత్తిడి
మానసికంగా అయినా శారీరకంగా అయినా ఒత్తిడి తీసుకుంటే తలనొప్పి రావడం సహజం. ఇది కూడా తరచూ తలనొప్పి రావడానికి కారణం అవుతుంది. ఒత్తిడి వల్ల తలలోని, మెడలోని కండరాలు బిగుతుగా మారి.. నొప్పిని కలిగిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి తలనొప్పిని తీవ్రతరం చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ పనులు చేయాల్సి ఉంటుంది. నెక్ మసాజ్ వల్ల కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి.
సరిగ్గా కూర్చోకుంటే..
ఆఫీస్ వర్క్ చేసేవారికి తలనొప్పి తరచుగా రావడానికి బ్యాడ్ పోస్టర్ కూడా ఓ కారణమవుతుంది. సరిగ్గా కూర్చోకపోవడం వల్ల మెడ, భుజాలలో కండరాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల టెన్షన్ పెరిగి తలనొప్పి వస్తుంది. ఇది రెగ్యులర్ తలనొప్పులకు దారితీస్తుంది. కాబట్టి మీరు సరిగ్గా కూర్చున్నారో లేదో చెక్ చేసుకోండి. అలాగే మధ్యలో లేచి నడుస్తూ ఉండండి.
ఆహారంతో కూడా
ప్రాసెస్ చేసిన మీట్, ఆల్కహాల్, కెఫిన్, గ్లూటన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, పానీయాలు తలనొప్పికి కారణమవుతాయి. ఇవి రక్తప్రవాహం లేదా నరాల్లో సెన్సిటివిటీని పెంచుతాయి. దీనివల్ల నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. అలాగే కొన్ని ఆహారాలు కూడా తలనొప్పిని ట్రిగర్ చేస్తాయి. కాబట్టి హెల్తీ ఫుడ్‌పై ఫోకస్ చేస్తే మంచిది.
నిద్ర
సరైన నిద్ర, గాఢ నిద్ర లేకపోవడం వల్ల కూడా డే టైమ్‌లో తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశముంది. ముఖ్యంగా నిద్ర ఇంపాక్ట్ మైగ్రేన్‌పై చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలు రాత్రి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. వర్క్ సమయంలో బాగా తలనొప్పిగా ఉంటే 10 నిమిషాలు రెస్ట్‌కి కేటాయిస్తే రిలీఫ్ ఉంటుదని సూచిస్తున్నారు నిపుణులు.
వాటికి దూరంగా ఉండాలి
తలనొప్పి వస్తే చాలామంది కెఫిన్, ఆల్కహాల్‌ని ఆశ్రయిస్తారు. ఈ రెండూ కూడా టెంపరరీగా రిలీఫ్‌ని ఇచ్చినా.. లాంగ్ టర్మ్‌లో తలనొప్పిని పెంచుతాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. స్మోకింగ్ కూడా తలనొప్పికి దారి తీస్తుందట.
తలనొప్పి తరచూ రావడానికి ఇవి కూడా కారణాలేమో చెక్ చేసుకోండి. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ మెరుగై తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇవన్నీ పాటించినా కూడా మీకు తలనొప్పి ఎక్కువగా వస్తే కచ్చితంగా వైద్యుల దగ్గరకు వెళ్లండి. వీలైనంత త్వరగా వెళ్తే.. త్వరగా తలనొప్పిని తగ్గించుకుని.. ప్రాణాంతక సమస్యలను దూరం చేసుకోగలుగుతారు.
Also Read : ఉదయాన్నే నిమ్మరసాన్ని నల్ల ఉప్పుతో కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు.. ముఖ్యంగా సమ్మర్లో మరీ మంచిదట, ఎందుకంటే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

