అన్వేషించండి

AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం

అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. పిచ్చుకలపాలెం వద్ద అత్యాధునిక ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

సుమారు 165 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ అకాడమీని నిర్మిస్తున్నారు. మొత్తం 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ భవన సముదాయం, న్యాయాధికారులకు అత్యున్నత స్థాయి శిక్షణ అందించే కేంద్రంగా నిలవనుంది. ఒకేసారి 120 మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ ఇచ్చేలా ఈ అకాడమీని శాస్త్రీయంగా రూపొందించారు.


AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం

ఈ అకాడమీలో 500 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఆడిటోరియంతో పాటు, శిక్షణ పొందే వారి కోసం గ్రౌండ్ ప్లస్ 8 (G+8) అంతస్తులతో కూడిన భారీ హాస్టల్ బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. వీటితో పాటు, అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల కోసం 69.4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రత్యేక అతిథిగృహానికి కూడా జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు.

న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయని.. ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదన్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని సీజేఐ అన్నారు. అమరావతిలో నిర్వహించిన మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం వల్ల కేసులు వేగంగా పరిష్కారం అవుతాయని, అయితే న్యాయం జరుగుతుందని ఇరుపక్షాలు నమ్మాలి. న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకంతో ప్రజలు కోర్టులకు వస్తున్నారు. కానీ చాలా కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులకు రాకుండా సమస్యలు పరిష్కారం అవుతాయి. మధ్యవర్తిత్వం ద్వారా పలు దేశాల్లో కేసులు పరిష్కారం చేసుకుంటున్నారు. మనదేశంలోనూ మధ్యవర్తిత్వం వైపు మొగ్గుచూపితే సుదీర్ఘకాలం కోర్టుల చుట్టూ తిరిగే అవసరం ఉండదని, అదే సమయంలో ఇరుపక్షాలకు న్యాయం జరుగుతుందని’ అని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.


AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం

హైకోర్టు జడ్జీల నివాస గృహ సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్  ఆదివారం ప్రారంభించారు. సి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్ల వ్యయంతో 33.20 ఎకరాల విస్తీర్ణంలో 36 మంది హైకోర్టు న్యాయమూర్తుల కోసం నివాస గృహాలను నిర్మించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 13 బంగాళాలను నిర్మించేందుకు స్థలాన్ని కూడా కేటాయించారు.

ప్రతి నివాస గృహాన్ని 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ నమూనాలో.. న్యాయమూర్తుల అవసరాలకు అనుగుణంగా ఆఫీసు గది, వెయిటింగ్ హాల్ తదితర వసతులతో ఈ గృహాలను సమగ్రంగా రూపొందించారు. బి.ఎస్.ఆర్. ఇన్ఫ్రాటెక్ సంస్థ నిర్మాణం చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నివాస సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని జస్టిస్ సూర్యకాంత్ ఆవిష్కరించారు. అనంతరం జడ్జిల బంగ్లాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. 
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎస్.వి.ఎస్. భట్టి, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ సీఎస్ సాయి ప్రసాద్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్యామల రావు, సురేష్ కుమార్, CRDA కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్.పి. వకుల్ జిందాల్ పాల్గొన్నారు. అనంతరం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు, ఇతర న్యాయమూర్తులతో కలిసి ఒక నివాస గృహాన్ని సందర్శించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Embed widget