వివిధ కారణాల వల్ల, వర్క్ ప్రెజర్​ వల్ల కొన్నిసార్లు ఆఫీస్​లో ఉన్నప్పుడు తలనొప్పి వస్తుంది.

డీహైడ్రేషన్​గా ఉండడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. నీటిని తాగితే కాస్త ఉపశమనం లభిస్తుంది.

కాసేపు ఆఫీస్​లో నడవండి. లేదంటే సింపుల్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల రిలీఫ్ ఉంటుంది.

మెడపై, కంటిపై కాస్త మసాజ్ చేసుకోవడం వల్ల మీకు తలనొప్పి కాస్త తగ్గుతుంది.

మీ బ్యాగ్​లో పెప్పర్​మెంట్​ ఆయిల్ ఉంచుకోండి. దీని వాసన చూడడం వల్ల బెనిఫిట్ ఉంటుంది.

అల్లం ముక్కను నోట్లో ఉంచుకున్నా.. అల్లం టీ తాగిన మంచి ఫలితాలుంటాయి.

కెఫీన్​ తాగితే తలనొప్పి పెరుగుతుంది. కానీ తక్కువ మోతాదులో తీసుకుంటే రిలీఫ్ ఉండొచ్చు.

డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల మైండ్ ప్రశాంతంగా మారుతుంది. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది.

కుదిరితే చిన్న స్లీప్ వేయండి. ఇది మీకు తలనొప్పిని దూరం చేసి.. రిలీఫ్​ని ఇస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచిది.