అన్వేషించండి

Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు

AP People In Gulf Countries | గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ వాసులు ఆందోళన చెందవద్దని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

అమరావతి: ఇరాన్ - ఇజ్రాయెల్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయాందోళన నెలకొంది. ఎటువైపు నుంచి బాంబులు వచ్చి పడతాయోనని గల్ఫ్ దేశాల్లోని భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు.  గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడ నివసిస్తున్న ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, ఇండియన్స్ భద్రతను కేంద్ర విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఏపీ ఎన్నార్టీ (APNRTS) ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 85000 27678 ను అందుబాటులోకి తెచ్చింది. గల్ఫ్ బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ apnrts.ap.gov.in ను సంప్రదించాలని సూచించారు. గల్ఫ్ ప్రాంతంలోని ఏపీ పౌరులందరూ వెంటనే తమ వివరాలను ఇండియన్ ఎంబసీలో నమోదు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ప్రస్తుతం నిలిచిపోయిన విమాన సర్వీసులు త్వరలోనే పునరుద్ధరిస్తారని, అప్పటి వరకు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారాన్నే అనుసరించాలని ఆయన పౌరులను హెచ్చరించారు.

ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్..

అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించడాన్ని ఇరాన్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. తమ దేశ అత్యున్నత నాయకుడి మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, ఈ చర్యకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ క్యాబినెట్ హెచ్చరించింది. దాంతో దుబాయ్, సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు, బేస్ క్యాంపులను టార్గెట్ చేసుకుని ఇరాన్ డ్రోన్, మిస్సైల్ దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ మీద సైతం ప్రతీకార జ్వాలలతో ఇరాన్ ఆర్మీ రగిలిపోతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dangerous bike smoke: బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
బైక్ ఆన్ చేసి గదిలో ఉంచితే ప్రాణాలు మిగలవు - పుంగనూరు ఘటనలో జరిగింది ఇదే - ఎందుకంటే ?
East Godavari Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!
తూర్పుగోదావరి జిల్లాలో వివాహిత‌ మ‌ర్డ‌ర్ అండ్ రేప్ కేసులో రాజ‌మండ్రి కోర్టు సంచ‌ల‌న తీర్పు; మృగాళ్ల‌కు జీవిత ఖైదు,జ‌రిమానా!
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget