Fitness Tips: 'ధురంధర్' స్టార్ ఫిట్నెస్ మంత్ర... మహిళలకు స్ఫూర్తి ఇచ్చేలా సౌమ్య టాండన్ పోస్ట్
Saumya Tandon Fitness Tips: 'ధురంధర్'తో సౌమ్య టాండన్ పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో అక్షయ్ ఖన్నా భార్యగా కనిపించారు. అభిమానులకు ఆవిడ ఫిట్నెస్ సీక్రెట్స్ చెప్పారు.

'ధురంధర్' విజయంతో సౌమ్య టాండన్ పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో అక్షయ్ ఖన్నా భార్యగా కనిపించారామె. ఆ సినిమాకు ముందు టీవీ సీరియల్ 'భాబీజీ ఘర్ పర్ హై'లోని 'గోరీ మేమ్'గా పాపులర్. ప్రస్తుతం 'ధురంధర్' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు... ఫ్యాన్స్, ఆడియన్స్ కోసం ఆవిడ ఫిట్నెస్ సీక్రెట్స్ చెప్పారు. ఫిట్నెస్ అనేది మధ్యలో వదిలేసే పని కాదని, జీవితాంతం చేసే కట్టుబాటు అని సౌమ్య అన్నారు. ముఖ్యంగా మహిళలు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే శ్రద్ధ తీసుకోవడం ఎప్పుడూ ఆపకూడదన్నారు.
ఫిట్నెస్ ప్రయాణం గురించి సోషల్ మీడియా పోస్ట్
సౌమ్య టాండన్ సోషల్ మీడియాలో తన ఎక్స్‌ర్‌సైజ్ ఫోటోలు షేర్ చేశారు. ఏరియల్ యోగా, ప్లాంక్స్, TRX వ్యాయామాలు, పిలాటెస్ చేస్తూ కనిపించారు. ఫిట్నెస్ జర్నీ గురించి మాట్లాడుతూ... ''యోగా, పిలాటెస్, వెయిట్ ట్రైనింగ్ చాలా సంవత్సరాలుగా నా డైలీ లైఫ్‌లో భాగం. ఎప్పుడూ ఆగకండి... మోకాలు గాయం అయినా, ప్రెగ్నెంట్ అయినా లేదా సయాటికా అయినా? ఎలాంటి పరిస్థితిలో అయినా జిమ్, వర్కవుట్స్ చేయండి'' అని చెప్పారు. మహిళలు వెయిట్ లిఫ్టింగ్ చేయాలని కూడా సౌమ్య సలహా ఇచ్చారు.
Also Read: Vijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?
మోడలింగ్ నుంచి కెరీర్ ప్రారంభించిన సౌమ్య
సౌమ్య టాండన్ తన కెరీర్‌ను మోడలింగ్ నుంచి ప్రారంభించారు. ఫెమినా కవర్ గర్ల్ (2006) మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లలోనూ పని చేశారు. ఉదాహరణకు... 2008లో ఆఫ్ఘన్ సీరియల్ 'ఖుషి'. అందులో ఆమె ఆఫ్ఘన్ మహిళా వైద్యురాలిగా ప్రధాన పాత్ర పోషించారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన 'జబ్ వి మెట్'లో కరీనా కపూర్ సోదరి రూప్ పాత్రతో ఆమె గుర్తింపు పొందారు.
Also Read: Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
View this post on Instagram
టీవీ ప్రపంచంలో 'గోరీ మేమ్'గా పాపులర్
సౌమ్య కామెడీ షో 'భాబీజీ ఘర్ పర్ హై' (2015)లో చేశారు. అనితా భాభీ పాత్రను పోషించారు. అయితే ఆడియన్స్ ప్రేమగా 'గోరీ మేమ్' అని పిలిచేవారు. ఆ పాత్ర ఆమెకు టీవీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
'ధురంధర్'తో వెండితెరపై మరో హిట్
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్'లో రహమాన్ డకాయిత్ భార్య పాత్ర పోషించారు సౌమ్య. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు నటించిన సినిమాతో భారీ విజయం అందుకున్నారు.
Also Read: Renu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు























